పెళ్లి కూతురు అనగానే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది ఏంటీ.. అలంకరణ.. ఒంటి నిండా ఆభరణాలు, ముఖం నిండా మేకప్.. హెయిర్ మేకప్.. ఇలా పెళ్లి పీటలు ఎక్కటానికి ఆరు, ఏడు గంటల నుంచే సింగారం మొదలవుతుంది. ఒక్క పెళ్లి కూతురు మాత్రమే కాదు.. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు అబ్బాయి తరపు లేడీస్ అంతా ఇదే విధంగా తయారు అవుతారు. పెళ్లి కూతురు అంటే ఇలాగే రెడీ అవుతారు అన్నట్లు అలంకరణ ఉంటుంది.. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓ పెళ్లి కూతురు ఫొటో పిచ్చపిచ్చ ట్రోల్ అవుతుంది. ఎందుకు.. ఏమిటీ అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందామా.
అమెరికా దేశం.. న్యూయార్క్ సిటీకి దగ్గరలో ఉన్న విస్కాన్సిన్ అనే ఏరియా. 26 ఏళ్ల మాడిసన్ అజెవెడో. పెళ్లి కుదిరింది. 2025 నవంబర్ నెలలో పెళ్లి చేసుకున్నది. ఇందులో వింత, విశేషం ఏముందీ అంటారా.. పెళ్లి రోజు ఆమె కనిపించిన తీరు.. అవును.. రోజు మాదిరిగానే.. రోజూ ఆఫీసుకు ఎలా అయితే రెడీ అయ్యి వెళుతుందో.. అలాగే పెళ్లి వేడుకకు వచ్చింది.
ముఖంపై పౌడర్ కూడా లేదు.. జస్ట్ స్నానం చేసి వచ్చేసింది. కాకపోతే పెళ్లికి సంబంధించిన దుస్తులు వేసుకున్నది. అవి కూడా ఏమంతా కాస్ట్లీ కాదు. ఇక ఆఫీసుకు ఏ హెయిర్ స్టయిల్ తో వెళుతుంటే.. అలాగే ఉంచేసింది. గోళ్లకు స్పెషల్ నెయిల్ పాలిష్ అంటూ ఏమీ లేదు. జస్ట్ డ్రస్ మారింది అంతే.. చాలా చాలా సింపుల్ గా.. రోజూ తనను ఎలా అయితే చూస్తారో అందరూ.. అలాగే పెళ్లి చేసుకున్నది.
సోషల్ మీడియాలో తాను పోస్ట్ చేసిన ఈ ఫొటోలు వరల్డ్ వైడ్ వైరల్ అయ్యాయి. ఈ కాలంలో కూడా మేకప్ లేకుండా పెళ్లి చేసుకుంటున్నారా అంటూ నోరెళ్లబెడుతున్నారు నెటిజన్లు. ఆమె పోస్టులకు వచ్చిన కామెంట్లు చూసి మాడిసన్ అజెవెడో ఆశ్చర్యపోయింది. మేకప్ లేకుండా పెళ్లి చేసుకోవటం ఇంత ఆశ్చర్యమా అంటూ ఆమెనే అవాక్కయ్యింది. తనకు వచ్చిన కామెంట్లపై స్పందిస్తూ.. నా భర్త నన్ను రోజూ ఇలాగే చూస్తాడు.. నేను నాలా ఉండటానికే ఇష్టపడతాను.. అందుకే పెళ్లి రోజు కూడా ఎలాంటి అలంకరణ, మేకప్ లేకుండా రెడీ అయ్యాను.. నా భర్తకు కూడా ఇదే ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది.
ఏదిఏమైనా మన లేడీస్ మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోవటం కష్టమే మరీ.. మేకప్ లేకుండా ఫంక్షన్ ఏంటీ అంటారు కదా.. అవును.. మామూలుగా వెళితే గెస్టులు అనుకోరు మనోళ్లు.. అర్థం అయ్యిందా రాజా..
