హైదరాబాద్ లో  ఫైర్ సేఫ్టీపై అవ‌‌గాహ‌‌న  

హైదరాబాద్ లో  ఫైర్ సేఫ్టీపై అవ‌‌గాహ‌‌న  

హైదరాబాద్ సిటీ, వెలుగు :  నాంప‌‌ల్లి ఫ‌‌ర్నిచ‌‌ర్ షోరూంలో జ‌‌రిగిన అగ్ని ప్రమాదంతో పాటు ఇటీవల జ‌‌రిగిన ప‌‌లు ప్రమాదాల నేప‌‌థ్యంలో హైడ్రా అవ‌‌గాహ‌‌న కార్యక్రమాల‌‌ను ప్రారంభించింది. మంగళవారం సుమారు 40 ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగితే ఎలా స్పందించాలి? ఎలా మంటలు ఆర్పాలి? ఎలా బయటపడాలి అన్న విషయాలను వివరించారు. ఫైర్ ​యాక్సిడెంట్ ​జరిగితే 101తో పాటు హైడ్రా కంట్రోల్ రూమ్ 1070, 9000113667 కు ఫోన్ ​చేయాలన్నారు. కొన్ని చోట్ల ఫైర్ మాక్ డ్రిల్స్ నిర్వహించారు.