Virat Kohli: భారత క్రికెట్ దిగ్గజం, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మైదానంలోనే కాదు.. వ్యాపార రంగంలోనూ తన సరికొత్త ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేశాడు. తాజాగా ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్‌ఇన్ (LinkedIn) లోకి కోహ్లీ అధికారికంగా అరంగేట్రం చేశాడు. తన తొలి పోస్ట్‌లోనే భారత్ నుంచి ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ బ్రాండ్‌లను, బిజినెస్‌లను ఎలా నిర్మించాలో తన విజన్‌ను పంచుకున్నాడు. ఇండియా కేవలం ప్రపంచ స్థాయి అథ్లెట్లను తయారు చేయడమే కాకుండా, అంతర్జాతీయంగా పోటీ పడే గ్లోబల్ బ్రాండ్లను కూడా సృష్టించాలని కింగ్ కోహ్లీ పిలుపునిచ్చాడు.
అగిలిటాస్ స్పోర్ట్స్, వన్-8 వరల్డ్:
తన ప్రొఫెషనల్ రంగానికి సంబంధించి Agilitas Sportsలో ఇన్వెస్టర్‌గా, అలాగే one8world కి కో-ఫౌండర్, కో-క్రియేటర్‌గా ఉన్నట్లు విరాట్ కోహ్లీ తెలిపాడు. మ్యానుఫ్యాక్చరింగ్, కన్జ్యూమర్ బ్రాండ్స్, డిస్ట్రిబ్యూషన్ రంగాలలో తన బిజినెస్ ప్రయోజనాలు మరింత విస్తరించి ఉన్నాయని వెల్లడించాడు. సొంత ఊరిలో వేలాది మంది అభిమానుల మధ్య తన one8world బ్రాండ్ రూపుదిద్దుకోవడాన్ని చూడటం ఎప్పటికీ మరచిపోలేనని గుర్తుచేసుకున్నాడు. క్రీడల్లో ఏ వైఖరినైతే అనుసరిస్తామో.. వ్యాపార రంగంలోనూ అదే సూత్రం వర్తిస్తుందని, సరైన ఆలోచనతో నిర్మాణాత్మకంగా అడుగులు వేస్తే ప్రజలు దానిని తప్పక ఆదరిస్తారని పేర్కొన్నాడు.
►ALSO READ | ఉప్పల్‌లో ఇక ఫ్లాట్ పిచ్ కాదు: విండీస్‌ను ఢీ కొట్టేందుకు బిగ్ ప్లాన్: తిలక్ వర్మ కామెంట్స్ వైరల్
గ్లోబల్ స్పోర్ట్స్ హబ్‌గా భారత్: కోహ్లీ విజన్
ఇండియన్ స్పోర్ట్స్ ఇండస్ట్రీ భవిష్యత్తుపై విరాట్ కోహ్లీ ఎంతో ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రతి క్రీడనూ ఆదరించే భారతదేశాన్ని చూడాలని నేను ఎప్పుడూ కలలు కనేవాడిని అని తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. నేటి తరం ఇండియా నుంచి ప్రపంచ స్థాయి అథ్లెట్లను అందించడమే కాక, అంతర్జాతీయ మార్కెట్‌లను శాసించే అత్యుత్తమ బ్రాండ్లను నిర్మించగలదని నిరూపిస్తోందని విశ్వాసం వ్యక్తం చేశాడు. క్రికెటర్‌గా ఎన్నో చారిత్రాత్మక రికార్డులు నెలకొల్పిన కింగ్ కోహ్లీ, ఇప్పుడు వ్యాపారవేత్తగానూ క్రీడా రంగానికి, భారత ఆర్థిక వ్యవస్థకు తన వంతు సహకారాన్ని అందిస్తుండటం విశేషం.
