హైదరాబాద్.. విజయవాడ హైవేపై హోటళ్లల్లో తనిఖీలు : కుళ్లిన కూరగాయలు, బూజుపట్టిన పేస్టులు

హైదరాబాద్.. విజయవాడ హైవేపై హోటళ్లల్లో తనిఖీలు : కుళ్లిన కూరగాయలు, బూజుపట్టిన పేస్టులు

తెలుగు రాష్ట్రాల్లో నిత్యం బిజీగా ఉండే హైవే అంటే.. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి అనే చెప్పాలి. ఏదైనా పండగలు, సెలవుల సమయంలో ఈ రూట్లో ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. ఈ రూట్లో ప్రయాణించేవారు ఖచ్చితంగా హోటళ్లు, డాబాల దగ్గర ఆగుతుంటారు. అలాంటి వారికి పిడుగులాంటి వార్త ఇది.. హైదరాబాద్-విజయవాడ హైవేపై ఉన్న హోటళ్లలో మంగళవారం ( అక్టోబర్ 13 ) TG SAFE అధికారులు చేపట్టిన తనిఖీల్లో దారుణమైన విషయాలు బయటపడ్డాయి.. అవేంటో చూడండి..

హైదరాబాద్ విజయవాడ హైవేపై కొయ్యలగూడెం నుంచి కోదాడ వరకు ఉన్న హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు అధికారులు. ఈ తనిఖీల్లో దారుణాలు వెలుగులోకి వచ్చాయి. చాలా హోటళ్లలో అడుగడుగునా నిర్లక్ష్యం బయటపడిందని తెలిపారు అధికారులు. ఆహారాన్ని స్టోర్ చేసే స్టోర్ రూములు, కిచెన్లలో ఎలుకలు, బొద్దింకలు స్వైర విహారం చేస్తున్నట్లు తెలిపారు అధికారులు. కొన్ని హోటళ్లలో వాడుతున్న పప్పులు, సరుకులు పురుగులు పట్టాయని..నిబంధనలకుక్ విరుద్ధంగా ముందు రోజు వండిన ఆహారాన్ని స్టోర్ చేసి కస్టమర్లకు వడ్డిస్తున్నారని తెలిపారు అధికారులు.

అంతే కాకుండా... మాంసం, పాల ఉత్పత్తులు స్టోర్ చేసేందుకు నిర్దిష్ట ఉష్ణోగ్రతలు పాటించడం లేదని తెలిపారు అధికారులు. గడువు ముగిసిన FSSAI లైసెన్స్ తో హోటళ్లు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోటళ్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు. నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని.. పలు హోటళ్లను సీజ్ చేశామని తెలిపారు అధికారులు.

►ALSO READ | జాయింట్ సర్వే రిపోర్ట్ కోసం రూ.30 లక్షల లంచం... ఏసీబీ వలలో అబ్దుల్లాపూర్ మెట్ సర్వేయర్, ఎమ్మార్వో...