బంగారం, వెండి ధరలు రోజురోజుకి కరిగిపోతున్నాయి. గత వారం రోజుల్లోనే బంగారం, వెండి ఆల్ టైం హై రికార్డు స్థాయి నుండి కుప్పకూలుతున్నాయి. ఒక విధంగా చూస్తే ఈ ఏడాది జనవరి నుండి ఎవరు ఊహించనంతగా పెరిగి ఒక్కసారిగా పతనమవుతూ వస్తుంది. అసలే పెళ్లిళ్ల సీజన్ రాబోతుంది.. ఇప్పటికే కొనలేని స్థాయికి చేరిన బంగారం, వెండి ధరలు ఇలా అనూహ్యంగా ధరలు తగ్గడం సామాన్యుల్లో కొంత ఆశలు పెంచాయి.
ఇక వెండి ధరలు చూస్తే సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది. చూస్తుండగానే రోజురోజుకి వందల నుండి వేలల్లో పెరుగుతూ లక్షలు దాటింది. చివరికి ఎన్నడూ లేనంతగా కేజీ వెండి ధర 4 లక్షలు దాటి ఆల్ టైం రికార్డు సెట్ చేసింది. అయితే వెండి ధరలు ఇంతలా పెరగడానికి ప్రపంచ రాజకీయ ఉద్రిక్తలు నుండి డిమాండ్, సప్లయ్ సహా చాల అంశాలలు ప్రభావం చూపెడతాయి. బంగారం రోజుల్లో చూస్తే వెండి ధర వేలకు వేలు పెరుగుతూ ఇన్వెస్టర్లలో సేఫ్ అసెట్ గా నిలిచింది. వెండి ఇంతలా పెరగడానికి దాని డిమాండ్ అలాగే ఇన్వెస్టర్లు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయడానికే ఎక్కుగా మొగ్గు చూపారు.
ALSO READ : త్వరలోనే ఇండియా, అమెరికా ట్రేడ్ డీల్
ఇక ప్రస్తుతం తెలుగు రాష్టాల్లో చూస్తే....
లోకల్ మార్కెట్లో 24క్యారెట్ల 1 గ్రాము ధర రూ.15,175 ఉండగా రూ.142 తగ్గింది. 22 క్యారెట్ల ధర రూ.13,910తో రూ.130 పడిపోయింది. 18క్యారెట్ల ధర రూ.11,381 చేరగా.. రూ.107 దిగొచ్చింది.
10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.1,420 తగ్గి రూ.1,51,750, 22 క్యారెట్ల ధర రూ.1,300 తగ్గి రూ.1,39,100, 18 క్యారెట్ల ధర రూ.1,070 తగ్గి రూ.1,13,810
హైదరాబాద్, వరంగల్, కరీంనగర, ఖమ్మంలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.1,51,750, 22 క్యారెట్ల ధర రూ.1,39,100, 18 క్యారెట్ల ధర రూ.1,13, 810
ALSO READ : భారీగా పడిపోయిన బంగారం,వెండి ధరలు
విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురం 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.1,51,750, 22 క్యారెట్ల ధర రూ.1,39,100, 18 క్యారెట్ల ధర రూ.1,13, 810
వెండి ధరలు:
బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పరుగులు పెడుతూ ఆకాశాన్ని తాకింది. కొద్దికాలంలోనే వెండి ధర 40 శతం పెరిగి 4 లక్షలు దాటింది. బంగారంతో పోల్చితే వెండి ధరలు డబుల్ కంటే పెరిగింది. ప్రస్తుతం లోకల్ మార్కెట్లో గ్రాము వెండి ధర రూ.280 ఉండగా రూ.20 తగ్గింది. దింతో కేజీ ధర రూ.2,80,000 చేరి రూ.20,000 తగ్గింది.
ALSO READ : జీఎస్టీ తగ్గింపుతో కార్ల అమ్మకాల జోరు
బంగారం, వెండి ధరలు రానున్న రోజుల్లో మరింతల తగ్గుతాయా లేదా అని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటి ధరలు ఇలా ఒక్కసారిగా పెరుగుతూ సామాన్యుల్లో దడ పుట్టించి ఒక్కసారి తగ్గుతూ రావడం అటు సామాన్యుల్లో ఇటు రానున్న పెళ్లిళ్ల సీజనలో బంగారం వెండి కొనే కస్టమర్లలో కొంత రిలీఫ్ కనిపిస్తుంది.
