జీఎస్టీ తగ్గింపుతో కార్ల అమ్మకాల జోరు

జీఎస్టీ తగ్గింపుతో  కార్ల అమ్మకాల జోరు
  •     జనవరిలో 4,55,000 యూనిట్లకు పెరిగిన డొమెస్టిక్ సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
  •     టాటా, మహీంద్రా, టయోట 
  • బండ్లకు డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌     1,74,529 వెహికల్స్ అమ్మిన మారుతి

న్యూఢిల్లీ : జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ తగ్గింపుతో  ఇండియాలో  కార్ల అమ్మకాలు పుంజుకుంటున్నాయి. ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూవీలకు డిమాండ్ కొనసాగడం కలిస్తోంది.  కార్లు, వ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, యుటిలిటీ వెహికల్స్ వంటి   ప్యాసింజర్ బండ్ల  (పీవీలు) అమ్మకాలు డొమెస్టిక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  4,55,000 యూనిట్లకు చేరాయి.  కిందటేడాది ఇదే నెలలో జరిగిన 4,04,000 యూనిట్లతో పోలిస్తే 12.6 శాతం వృద్ధి నమోదైంది. దేశంలో అతిపెద్ద కార్ల తయారీదారు మారుతి సుజుకి 1,74,529 బండ్లను విక్రయించి 0.54 శాతం  వృద్ధి సాధించింది. ఎగుమతులు కూడా కలుపుకుంటే కంపెనీ సేల్స్ 2,36,963 యూనిట్లకు చేరాయి.  

డిజైర్, ఎర్టిగా, స్విఫ్ట్, బ్రెజ్జా, బలెనో, విక్టోరిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాప్-10 బెస్ట్ సెల్లింగ్ మోడళ్లలో చోటు దక్కించుకున్నాయి. 1,75,000 పెండింగ్ బుకింగ్స్ ఉన్నాయని, ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇబ్బందులతో  డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీర్చడం ఆలస్యమవుతోందని కంపెనీ  మార్కెటింగ్ అధికారి పార్థో బెనర్జీ తెలిపారు. టాటా మోటార్స్ జనవరిలో  70,222 యూనిట్లు విక్రయించి 46.1శాతం వృద్ధి సాధించింది. తమ అత్యధిక నెలవారి అమ్మకాలను నమోదు చేసింది.  నెక్సాన్ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూవీ (23,365 యూనిట్లు),  పంచ్ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూవీ (19,257 యూనిట్లు) బండ్లను అత్యధికంగా అమ్మింది.  నెక్సాన్ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూవీ సేల్స్ ఇప్పటివరకు  10 లక్షల యూనిట్ల మైలురాయిని దాటగా, పంచ్ కేవలం నాలుగేళ్లలో 7 లక్షల యూనిట్లను అమ్మి దేశంలో వేగంగా అమ్ముడైన మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. తాజాగా లాంచ్ చేసిన సియార ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూవీ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కంపెనీ పెంచింది. 

మహీంద్రా అదే బాటలో..

ఈ ఏడాది జనవరిలో మహీంద్రా 63,510 యూనిట్లు విక్రయించి ఏడాది లెక్కన 25.37శాతం వృద్ధి సాధించింది. స్కార్పియో (15,542 యూనిట్లు),  బొలెరో (11,841 యూనిట్లు) మోడళ్లకు మంచి డిమాండ్ కనిపించింది.  కంపెనీ సీఈఓ  నలినికాంత్ గోల్లగుంటా మాట్లాడుతూ,  కొత్త మోడళ్లయిన ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూవీ 7ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓ, ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈవీ 9ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుకింగ్స్ నాలుగు గంటల్లోనే 93,689 యూనిట్లకు చేరాయని, వీటి వాల్యూ రూ.20,500 కోట్లుగా ఉందని తెలిపారు.   హ్యుందాయ్ 59,107 యూనిట్లు విక్రయించి 9.5శాతం వృద్ధి సాధించింది. క్రెటా ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూవీ (17,921 యూనిట్లు),  కొత్తగా వచ్చిన వెన్యూ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూవీ (12,413 యూనిట్లు)  అమ్మకాలు భారీగా పెరిగాయి. కంపెనీకి అత్యధిక అమ్మకాల నెలగా జనవరి నిలిచిందని హ్యుందాయ్  సీఈఓ తరుణ్ గార్గ్ అన్నారు.  టయోటా సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  17శాతం పెరిగి 30,630 బండ్లకు చేరాయి.   కొత్తగా విడుదల చేసిన -ఎలక్ట్రిక్ అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సేల్స్ పెరుగుతాయని కంపెనీ భావిస్తోంది. 

ఇండియాలో పీవీ అమ్మకాలు (యూనిట్లలో)..
కంపెనీ    జనవరి 2026    జనవరి 2025    గ్రోత్ 
మారుతి    1,74,529     1,73,599    0.54%
టాటా    70,222     48,076     46.1%
మహీంద్రా    63,510     50,659    25.37%
హ్యుందాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌    59,107     54,003    9.5%
టయోట    30,630     26,178    17%