బీదర్–యశ్వంత్ పూర్ ట్రైన్‎కు తప్పిన పెను ప్రమాదం.. ఇంజన్‎లో ఒక్కసారిగా చెలరేగిన పొగలు

బీదర్–యశ్వంత్ పూర్ ట్రైన్‎కు తప్పిన పెను ప్రమాదం.. ఇంజన్‎లో ఒక్కసారిగా చెలరేగిన పొగలు

హైదరాబాద్: బీదర్-యశ్వంత్ పూర్ ట్రైన్‎కు పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం (ఆగస్ట్ 7) బీదర్ నుంచి యశ్వంత్ పూర్ వెళ్తుండగా రైలు ఇంజన్ వెనుక జనరేటర్ భాగంలో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. రైలు జహీరాబాద్‎లో స్టేషన్‎లో ఆగిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రైన్ ఇంజన్‎లో పొగలు గుర్తించిన రైల్వే అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ సహయంతో పొగను అదుపు చేశారు. 

ఇంజన్ భాగంలో దట్టమైన పొగలు అలుముకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది సకాలంలో పొగను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో జహీరాబాద్ స్టేషన్‏లో ట్రైన్ దాదాపు అరగంట పాటు నిలిచిపోయింది. మరమ్మత్తుల అనంతరం ట్రైన్ తిరిగి బయలుదేరింది.