న్యూఢిల్లీ: బంగారం, వెండి ఫ్యూచర్స్ ధరలు సోమవారం కూడా పడ్డాయి. ఎంసీఎక్స్‌లో ఇంట్రాడే కనిష్టాల నుంచి కోలుకున్నా, చివరికి లాస్‌లో ముగిశాయి. గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ 10 గ్రాముల ధర రూ.10,688 (7.2 శాతం) తగ్గి రూ.1,37,065 లెవెల్‌కు పడిపోయింది. చివరికి రూ.1.48 లక్షల వద్ద ముగిసింది. మరోవైపు వెండి వరుసగా మూడో రోజు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. వెండి ఏప్రిల్ ఫ్యూచర్స్ కేజీ ధర 15శాతం పడిపోయి రూ.2,25,805 వరకు తగ్గింది. తర్వాత కొంత పుంజుకుని రూ.2,50,242 వద్ద 5.8శాతం తగ్గుదలతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో, కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్‌కి 4,750.31 డాలర్ల వద్ద, వెండి ఔన్స్‌కి 81.86 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.
హైదరాబాద్‌లో ధరలు ఇలా..
బంగారం, వెండి ధరలను ట్రాక్ చేసే గుడ్‌రిటర్న్ ప్రకారం, 10 గ్రా ములు గోల్డ్ (24 క్యారెట్ల) స్పాట్ ధర సోమవారం రూ.7,410 తగ్గి రూ.1,53,170 వద్ద ఉంది. వెండి ధర కేజీకి రూ.20 వేలు తగ్గి రూ.3 లక్షలకు దిగొచ్చింది.
