త్వరలోనే ఇండియా, అమెరికా ట్రేడ్ డీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

త్వరలోనే ఇండియా, అమెరికా ట్రేడ్ డీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్

న్యూఢిల్లీ:  భారత్–అమెరికా మధ్య  ట్రేడ్ డీల్  త్వరలోనే పూర్తవుతుందని  వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో  పేర్కొన్నారు.  అమెరికా పెద్ద ఆర్థిక వ్యవస్థ కావడంతో పూర్తి స్థాయి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఏ) కు  ఎక్కువ సమయం పడుతుందని చెప్పారు. ఇతర దేశాలతోనూ చర్చలు వేగంగా సాగుతున్నాయని, కొన్ని ఒప్పందాలు ఈ ఏడాదిలోనే పూర్తవుతాయని తెలిపారు. గత నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ, భారత్–అమెరికా వాణిజ్య సంబంధాలపై ఆశాభావం వ్యక్తం చేశారు.  

ఇండియాకు చెందిన మసాలాలు, టీ, కాఫీ వంటి 200కి పైగా వ్యవసాయ, ఆహార ఉత్పత్తులపై ఉన్న అధిక సుంకాలను తొలగించారు. అమెరికా, ఇండియా వాణిజ్య చర్చల్లో  ఇప్పటివరకు ఆరు రౌండ్లు పూర్తయ్యాయి. 2024–-25లో భారత మొత్తం ఎగుమతులు 825 బిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాలర్లకు చేరగా,  2025–-26లో ఇది 850 బిలియన్ డాలర్లను దాటుతుందని 
అంచనా.