SBI బ్యాంకులో ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు.. ఖాళీలు చాలానే ఉన్నయ్ !

SBI బ్యాంకులో ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు.. ఖాళీలు చాలానే ఉన్నయ్ !

హైదరాబాద్: బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న అభ్యర్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. 15 వందల 38 జూనియర్ అసోసియేట్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ప్రత్యేక విభాగాలలో ఉన్న 15 వందల 38 బ్యాక్ లాగ్ ఖాళీలను భర్తీ చేసేందుకు జూనియర్ అసోసియేట్ల కోసం ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు SBI తెలిపింది.

ఆన్ లైన్ దరఖాస్తులు ఆగస్టు 7 నుంచి ఆగస్టు 27, 2026 వరకూ అప్లై చేసుకోవచ్చు. 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న గ్రాడ్యుయేట్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలతో పాటు, భాషా ప్రావీణ్యత పరీక్ష కూడా ఉంటుంది.

SBI క్లర్క్ దరఖాస్తు ఫీజు వివరాలు:
* ఓబీసీ: రూ.750, ఎస్సీ/ఎస్టీ: రుసుము లేదు

SBI క్లర్క్ విద్యార్హత:
* అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీని పొంది ఉండాలి.
* ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (IDD) ఉన్న వారు తమ ఉత్తీర్ణత తేదీని ధృవీకరించుకోవాలి.
* డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ విధుల్లో చేరడానికి ముందు తప్పనిసరిగా తమ డిగ్రీని పూర్తి చేయాలి.
* SBI క్లర్క్ పరీక్షకు ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.

SBI క్లర్క్ 2026కు ఎలా అప్లై చేయాలంటే:
* ఎస్బీఐ క్లర్క్ 2026 కోసం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అధికారిక వెబ్ సైట్, sbi bank.inలో అందుబాటులో ఉంది. 
* ఆసక్తి ఉన్న, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ను నింపాలి. 
* ఫోటోగ్రాఫ్స్, సంతకాలతో పాటు అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేసి, దరఖాస్తు రుసుమును చెల్లించాలి.
* దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 27 ఆగస్టు 2026.