వికారాబాద్ లోని  26 వార్డుల్లో బీజేపీ పోటీ

వికారాబాద్ లోని  26 వార్డుల్లో బీజేపీ పోటీ

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ మున్సిపాలిటీలోని 34 వార్డులకు గానూ బీజేపీ 26 వార్డుల్లో అభ్యర్థులను బరిలో దింపిందని ఆ పార్టీ జాతీయ కౌన్సిల్ మెంబర్, వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల ఇన్‌‌చార్జి బంగారు శృతి తెలిపారు.

మంగళవారం వికారాబాద్​లో ఆమె మాట్లాడుతూ.. 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోకుండా ఉండేందుకే రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికల కో-ఇన్‌‌చార్జి అమృత, దిశా కమిటీ సభ్యుడు వడ్ల నందు, నాయకులు మాధవరెడ్డి, పెద్దింటి నవీన్‌‌కుమార్ పాల్గొన్నారు.