సభకు రావడానికి అమిత్ షాకు ఎందుకంత భయం.?: ఎంపీ వంశీకృష్ణ

సభకు రావడానికి అమిత్ షాకు ఎందుకంత భయం.?: ఎంపీ వంశీకృష్ణ

పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై చర్చించేందుకు మోదీ సర్కార్ ఎందుకు వెనకంజ వేస్తోంది? సభకు రావడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎందుకు భయపడుతున్నారు? అంటూ కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఎంపీ వంశీకృష్ణ.. కేంద్రం అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు. చర్చించి పాలన చేయడం కంటే, నియంత్రించడం, శిక్షించడానికే మోదీ సర్కార్ ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. గూగుల్, సోషల్ మీడియా వేదికగా నిరసనలు తెలుపుతున్న యువత (జెన్-జీ) పై ఢిల్లీలో జరిగిన లాఠీచార్జి ఘటనపై అమిత్ షా వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

►ALSO READ | పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‎కు జాతీయ హోదా ఇవ్వలేం: తెలంగాణకు కేంద్రం బ్యాడ్ న్యూస్

 జూలై 20వ తేదీన అసలు ఏం జరిగిందో దేశ ప్రజలకు వివరించాలని, యువతపై దాడులకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని వంశీకృష్ణ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ, కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.