- నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
గచ్చిబౌలి, వెలుగు: కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి మహిళపై లైంగిక దాడికి పాల్పడి, ఆమె వీడియోలు, ఫొటోలు చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడిన నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయదుర్గం పరిధిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న మహిళకు, అదే కంపెనీ ఉద్యోగులకు ఫుడ్ వెండర్‌గా పనిచేసే పటాన్‌చెరుకు చెందిన షేక్ నబీ(32)తో పరిచయం ఏర్పడింది. షేక్ నబీ కంపెనీ సమీపంలో బాక్స్ క్రికెట్ నిర్వహించేవాడు.
ఈ క్రమంలో కంపెనీ ఉద్యోగులు బాక్స్ క్రికెట్ బుక్ చేసుకునే సమయంలో బాధితురాలు కూడా వెళ్లడంతో ఇద్దరి మధ్య చనువు ఏర్పడింది. 2023లో కంపెనీ ఉద్యోగులు బాక్స్ క్రికెట్ ఆడిన అనంతరం పార్టీ నిర్వహించుకున్నారు. ఆ సమయంలో బాధితురాలికి తెలియకుండా ఆమె తీసుకున్న కూల్‌డ్రింక్‌లో షేక్ నబీ మత్తు పదార్థం కలిపి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడి వీడియోలు, ఫొటోలు తీసుకున్నాడు.
రూ.43 లక్షలు వసూలు..
ఆ తర్వాత తనతో కలిసి రెస్టారెంట్ వ్యాపారం ప్రారంభిస్తే మంచి లాభాలు వస్తాయని బాధితురాలిని షేక్ నబీ నమ్మించాడు. ఈ క్రమంలో బాధితురాలి వద్ద నుంచి రూ.43 లక్షలు తీసుకున్నాడు. అనంతరం బాధితురాలి వ్యక్తిగత వీడియోలు, ఫొటోలను చూపిస్తూ.. తన లైంగిక కోరికలు తీర్చకుంటే వాటిని ఆమె భర్త, పిల్లలు, బంధువులకు పంపిస్తానని బెదిరించాడు.
ఇలా 2023 నుంచి 2026 గత నెల వరకు బ్లాక్మెయిల్ చేస్తూ పలుమార్లు లైంగిక దాడి చేశాడు. బాధితురాలు జరిగిన విషయాన్ని భర్తకు చెప్పి రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడు షేక్ నబీని అరెస్ట్ చేశారు.
