ఏషియాడ్‌లో ఇండియా స్క్వాష్ ప్లేయర్లు సత్తా చాటారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో జోష్న చిన్నప్ప–వెలవన్ సెంథిల్‌కుమార్ జోడీ సెమీస్‌కు చేరుకోగా, సింగిల్స్‌లో అనహత్ సింగ్, అభయ్ సింగ్ తుది నాలుగు స్థానాలకు అర్హత సాధించారు.
దాంతో ఇండియాకు మూడు పతకాలు ఖాయమయ్యాయి. మిక్స్‌డ్ క్వార్టర్‌ఫైనల్లో జోష్న–సెంథిల్ 11–3, 11–5తో డేవిడ్ పెలినో–జెమికా అరిబాడో (ఫిలిప్పీన్స్)పై గెలిచారు. సింగిల్స్ క్వార్టర్స్‌లో అనహత్ సింగ్ 11–2, 11–5, 11–3తో తన్వీ ఖన్నాపై, అభయ్ 11–4, 11–3, 11–6తో రొనోస్కే సుకే (జపాన్)పై నెగ్గారు.
