టేబుల్ టెన్నిస్లో దియా–మనుష్ షాకు కాంస్యం

టేబుల్ టెన్నిస్లో దియా–మనుష్ షాకు కాంస్యం

టేబుల్‌‌ టెన్ని స్‌‌లో ఇండియా జోడీ దియా చిటాలే–మనుష్‌‌ షా కాంస్య పతకంతో సరిపె ట్టుకుంది. శుక్రవారం జరిగిన మిక్స్‌‌డ్‌‌ ఫైనల్లో ఇండి యా ద్వయం 0–4 (8–11, 5–11, 8–11, 2–11)తో చైనా చేతిలో ఓడింది. మ్యాచ్‌‌ ఆరంభం నుంచి తీవ్ర ఒత్తిడికి లోనైన దియా, మనుష్‌‌ 30 నిమిషాల్లోనే ప్రత్యర్థులకు లొంగి పో యారు. సెమీస్‌‌ ఓడినా.. ఈ క్రీడల్లో ఇండియాకు ఇది రెండో పతకం కావడం విశేషం.

ఎనిమిదేళ్ల కిందట జకర్తాలో శరత్‌‌ కమల్‌‌–మనిక బాత్రా కాంస్యం నెగ్గింది. మెన్స్‌‌ సింగిల్స్‌‌లో మనుష్‌‌ షా 4–0తో బెన్యా మిన్‌‌ ఫరాజీ (ఇరాన్‌‌)పై గెలిచి తదుపరి రౌండ్‌‌కు చేరుకోగా, విమెన్స్‌‌ సింగిల్స్‌‌లో యశస్విని ఘోర్పడే 4–1తో హెండ్‌‌ జాజా (సిరియా)పై గెలిచి రౌండ్‌‌–16కు క్వాలిఫై అయ్యింది.

ఇతర మ్యాచ్‌‌ల్లో మానవ్‌‌ ఠక్కర్‌‌ 2–4తో యు టే ర్యోంగ్‌‌ (ఉత్తర కొరియా) చేతిలో, తెలంగాణ ప్లేయర్‌‌ శ్రీజ ఆకుల 1–4తో ప్యోన్‌‌ సాంగ్‌‌ గ్యోంగ్‌‌ చేతిలో కంగుతిన్నారు.