హైదరాబాద్, వెలుగు: ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి (డబ్ల్యూటీఐటీసీ) గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడిగా టెక్‌ఎస్‌ఎంఈ కార్పొరేషన్ సీఈఓ శ్రీధర్ గోనెపల్లి నియమితులయ్యారు. ఐటీ రంగంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఆయన ఏఐ, సాంకేతిక కన్సల్టింగ్ రంగాలకు సేవలను అందిస్తున్నారు. ఈ నియామకంపై మండలి చైర్మన్ సందీప్ కుమార్ మక్తాల హర్షం వ్యక్తం చేశారు. తెలుగు సాంకేతిక నిపుణులను ప్రపంచవ్యాప్తంగా అనుసంధానించడంలో శ్రీధర్ అనుభవం సంస్థకు ఎంతో కీలకం కానుందని, ఐటీ నిపుణులకు మార్గదర్శకత్వం చేస్తారని ఆయన పేర్కొన్నారు.
