టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషాన్ వరల్డ్ కప్ ముందు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతున్నాడు. రెండేళ్ల తర్వాత భారత జట్టులో స్థానం సంపాదించి తన పునరాగమనాన్ని అద్భుతంగా చాటుకున్నాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసి దుమ్ములేపాడు. తొలి టీ20లో 8 పరుగులే చేసి విఫలమైనా రెండో టీ20 లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 32 బాల్స్‌లోనే 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 76 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఆ తర్వాత ఆదివారం (జనవరి 25) జరిగిన మూడో టీ20లోనూ 12 బంతుల్లోనే 28 పరుగులు చేయి జట్టుకు మెరుపు ఆరంభం ఇచ్చాడు.
ALSO READ : వరల్డ్ కప్ ముందు పసికూన డేంజర్ బెల్స్..
శనివారం (జనవరి 31) తిరువనంతపురం వేదికగా గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన చివరిదైన ఐదో టీ20 మ్యాచ్ లో 42 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. కిషాన్ ఇన్నింగ్స్ లో 6 ఫోర్లతో పాటు 10 సిక్సర్లున్నాయి. సెంచరీ తర్వాత 103 పరుగుల వద్ద కిషాన్ ఔటవ్వడంతో తన గ్రేట్ ఇన్నింగ్స్ కు ముగింపు పడింది. వరల్డ్ కప్ లో కిషాన్ ప్లేయింగ్ 11 లో ఉండడం ఖాయంగా మారింది. కిషాన్ దూకుడుకు టీమిండియా ఒక్కసారిగా టీ20 వరల్డ్ కప్ లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం టాప్ ఫామ్ లో ఉన్న కిషాన్ తన కెరీర్ లో ఇద్దరు కష్టమైన బౌలర్ల గురించి చెప్పుకొచ్చాడు. వారెవరో ఇప్పుడు చూద్దాం..
ALSO READ : ఆ విషయం నన్ను అడగకు
ఇటీవల 2 స్లోగర్స్ యూట్యూబ్ ఛానెల్‌లో కనిపించిన కిషాన్ తనను ఎక్కువగా ఇబ్బంది పెట్టే బౌలర్ల గురించి ప్రస్తావించాడు. స్పిన్నర్ల విషయానికి వస్తే టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ పేరు చెప్పాడు. చాహల్ ను ఎదుర్కోవడం తనకు చాలా కష్టంగా అనిపిస్తుందని ఈ టీమిండియా యంగ్ బ్యాటర్ అన్నాడు. చాహల్ స్పిన్ లో చాలా వైవిధ్యం ఉంటుందని అతను ఎప్పుడూ బంతులను ఒకేలా వేయడని..అంతేకాదు బ్యాటర్ల బలహీనతలు బట్టి బంతులు విసురుతాడని కిషాన్ తెలిపాడు. ఫాస్ట్ బౌలర్ల విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా అని.. బుమ్రా కంటే కష్టమైనా పేసర్ ఇంకెవరుంటారని కిషాన్ తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నాడు.
