గద్వాలలో 5.5 కేజీల గంజాయి పట్టివేత.. ఇద్దరు నిందితుల అరెస్ట్

గద్వాలలో 5.5 కేజీల గంజాయి పట్టివేత.. ఇద్దరు నిందితుల అరెస్ట్

గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఆదివారం నిర్వహించిన తనిఖీల్లో రూ.6 లక్షల విలువైన 5.5 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

ఇటిక్యాల మండలం శెనగపల్లి, మల్దకల్ మండలం విఠలాపురం గ్రామానికి చెందిన ఇద్దరు తమ పొలాల్లో గంజాయి సాగు చేసి, దానిని ఎండబెట్టి విక్రయించేందుకు తరలిస్తుండగా ఈ పట్టుబడటం జరిగింది. 

ఈ దాడిలో గంజాయితో పాటు ఒక మోటార్ సైకిల్‌ను సీజ్ చేయగా, మరో నిందితుడు పరారయ్యాడు. ఇటీవల పట్టుబడిన ఓ గంజాయి వినియోగదారుడు ఇచ్చిన సమాచారం ఆధారంగానే పోలీసులు ఈ దాడులు నిర్వహించినట్లు తెలిసింది.