తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 61 కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 61 కేసులు

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 61 మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది. ఇందులో హైదరాబాద్‌‌లో నే 34 కేసులు నమోదయ్యాయి. పాతబస్తీలోని అమన్‌‌నగర్‌‌‌‌లో ఒకే కుటుంబంలోని 13 మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది. ఈ ఫ్యామిలీలో వైరస్ సోకిన ఓ మహిళ రెండ్రోజుల క్రితం మరణించింది. ఆమె ద్వారా ఫ్యామిలీ మొత్తానికి వైరస్ సోకినట్టు అధికారు లు చెబుతున్నారు. ఈ కుటుంబంలో ఎవరికీ మర్కజ్ ట్రావెల్

హిస్టరీ లేదని, వైరస్ ఎలా వ్యాపించిందన్న దానిపై ఆరా తీస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆఫీసర్లు చెప్పారు. సోమవారం నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 592కు చేరింది. ఇందులో 103 మంది డిశ్చార్జ్ అవ్వగా 472 మంది వివిధ దవాఖాన్లలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. కరోనాతో మరో వ్యక్తి మరణించినట్టు సోమవారం వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. అయితే, మరణించిన వ్యక్తి వివరాలను వెల్లడించలేదు. ఈ వ్యక్తితో కలిపి రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 17కు చేరింది. వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఈ నెల 3న 75, ఈ నెల 5న 62 నమోదవగా.. మళ్లీ అదే స్థాయి లో సోమవారం కేసులు నమోదయ్యాయి. హాస్పిటల్‌ స్టాఫ్‌కు వైరస్‌‌ హైదరాబాద్‌‌లోని రెం డు బడా దవాఖాన్ల హెల్త్ స్టాఫ్‌‌ కు వైరస్ సోకినట్టు వైద్యారోగ్యశాఖ ఆఫీసర్లు గుర్తించారు. హైటెక్‌‌సిటీలోని ఓ హాస్పిటల్‌‌లో పని చేస్తున్న ఓ మహిళా ల్యాబ్ టెక్నీషియన్‌‌వైరస్ బారినపడగా.. సోమవారం చేసిన టెస్టుల్లో ఆమె కుటుంబంలోని ముగ్గురికి కూడా వైరస్ పాజిటివ్ వచ్చింది. గచ్చిబౌలిలోని ఓ హాస్పిటల్‌‌లో స్టాఫ్‌‌ నర్స్‌‌కు కూడా వైరస్ వచ్చింది. అదే హాస్పిటల్‌‌లో ఓ డాక్టర్‌‌‌‌కు కూడా వైరస్ లక్షణాలు ఉండడంతో శాంపిల్స్ ను  టెస్టులకు పంపించినట్టు తెలిసింది. ఈ రెం డు హాస్పిటల్స్‌‌లో నూ కరోనా పేషెంట్లకు ట్రీట్‌‌మెంట్ ఇస్తున్నారు.

తెగని మర్కజ్ లింక్‌‌

సోమవారం నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో ఎక్కువ శాతం మర్కజ్ లిం క్ కేసులేనని వైద్యారో గ్యశాఖ ఆఫీసర్లు పేర్కొన్నారు . మర్కజ్ రిటర్నీస్ కుటుంబ సభ్యులతోపాటు, బయటి వ్యక్తులకూ వైరస్ వ్యాపించింది. ఇటీవల వైరస్‌‌బారినపడి మరణించి న రంగారెడ్డిజిల్లా షాద్ నగర్ కు చెందిన ఓ మహిళ భర్తకు కూడా సోమవారం చేసిన టెస్టులో వైరస్ పాజిటివ్ వచ్చింది. వాళ్ల ఇంట్లో రెంట్కు ఉంటున్న బీహా ర్ వ్యక్తిద్వారా ఆమెకు వైరస్‌‌సోకగా.. ఆమె నుంచి భర్తకు అంటుకుంది. ఇటీవల బీహార్ వ్యక్తి ట్రైన్‌‌లో వస్తుండగా, తబ్లిగీ జమాత్ ప్రతినిధుల ద్వారా అతడికి వైరస్ సోకింది. ఇలా నాలుగో లింక్ వరకూ వైరస్ పాకడంతో అధికారవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

డేంజర్‌‌‌‌జోన్‌‌లో

హైదరాబాద్‌‌ గ్రేటర్ హైదరాబాద్లో కరోనాకేసుల సంఖ్య 267కు చేరింది. సోమవారం ఒక్కరోజే ఇక్కడ 34 కేసులు నమోదయ్యాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్ లో  వైరస్ కట్టడికి కొత్త స్ట్రాటజీ అమలు చేస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. జీహెచ్‌‌ఎంసీని 30 సర్కిళ్లుగా విభజించి, 30 మంది సీనియర్ డాక్టర్లకు ఒక్కో సర్కిల్ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు పబ్లిక్ హెల్త్ డైరక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు వెల్ల డించారు. సర్కిల్ ఇంచార్జ్ లకు  జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్‌‌‌‌(డీఎంహెచ్‌‌వో)తో సమానమైన అధికారాలను అప్పగిస్తున్నామన్నారు.

కొత్తగా దియోబంద్‌‌లింక్‌

‌ కరోనా కలవరానికి ఇన్నాళ్లు మర్కజ్ వ్య వహారమే కారణమవగా.. తాజాగా మరో లింక్‌‌ వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి 150 కిలో మీటర దూరంలో, ఉత్తరప్రదేశ్ లోని దియో బంద్‌‌లో జరిగిన ప్రారన్థ ల్లో పాల్గొన్న మన రాష్ట్రానికి చెందిన కొంతమందికి వైరస్ పాజిటివ్‌‌వచ్చింది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన సమాచారంతో దియోబం ద్‌‌కు వెళ్లొచ్చి నవారికి ఇక్కడి ఆఫీసర్లు టెస్టులు చేయించారు. ఇందులో ఆదిలాబాద్, నిర్మల్ జి ల్లాలకు చెందిన ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్‌‌, ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల నుంచి సుమారు వంద మందికిపైగా దియోబంద్కు ప్రార్ధనలకు వెళ్లొచ్చి నట్టు ఆఫీసర్లుచెబుతున్నారు . అయితే, వీళ్లల్లో కొందరు మర్కజ్ నుంచి దియోబంద్‌‌కు అక్కడి నుంచి అజ్మీర్ దర్గాకు వెళ్లొచ్చి నట్టు తెలుస్తోంది.