ఆకట్టుకుంటున్న 83 మూవీ ట్రైలర్

ఆకట్టుకుంటున్న 83 మూవీ ట్రైలర్

ముంబై: బాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ మూవీల్లో ఒకటైన 83 ట్రైలర్ తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. తాము గెలవడానికే వచ్చామని, గెలిచే తీరుతామని రణ్ వీర్ చెప్పిన డైలాగ్ బాగుంది. స్టార్ జోడీ రణ్ వీర్ సింగ్, దీపికా నటించిన ఈ సినిమా డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల కానుంది. హిందీతోపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 83 రిలీజ్ అవ్వనుంది. 1983 వరల్డ్ కప్ ను టీమిండియా గెలిచిన తీరు, అప్పటి సారథి కపిల్ దేవ్ జట్టును ముందుండి ఎలా నడిపాడనేదో కథాంశంగా ఈ సినిమా తెరకెక్కింది. 

దీప్ వీర్ తో జంటతోపాటు సీనియర్ నటుడు పంకజ్ త్రిపాఠి, తమిళ హీరో జీవా, తాహిర్ రాజ్ భసిన్, సకీబ్ సలీం, జతిన్ సర్నా, చిరాగ్ పాటిల్, దిన్కర్ శర్మ, నిషాంత్ దహియా, హర్దీ సంధూ, సాహిల్ ఖట్టర్, అమ్మీ విర్క్ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను కబీర్ ఖాన్, విష్ణు ఇందూరి, సాజిద్ నదియాడ్ వాలా, ఫాంటమ్ ఫిల్మ్స్, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ తో కలసి దీపికా పడుకోన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా, 1983 ప్రపంచ కప్ లో ఆడేందుకు ఏ మాత్రం అంచనాలు లేకుండా ఇంగ్లండ్ కు వెళ్లిన టీమిండియా.. ఏకంగా వెస్టిండీస్ లాంటి దిగ్గజ టీమ్‌ను ఓడించి కప్ గెలిచింది.

మరిన్ని వార్తల కోసం: 

బస్సు ఛార్జీల పెంపుపై సజ్జనార్ క్లారిటీ

‘మెడ మీద కత్తి’ పదానికి అర్థం చెప్పాలె

ఒక్కో దేశానికి వ్యాపిస్తున్న ఒమిక్రాన్