ఆర్టీసీ భూములు అమ్మబోం

ఆర్టీసీ భూములు అమ్మబోం

హైదరాబాద్: బస్సు డిపోలను మూసేస్తున్నారు, ఆర్టీసీ భూములను అమ్ముతున్నారని వస్తున్న వార్తలపై సంస్థ ఎండీ సజ్జనార్ స్పందించారు. డిపోలను మూసేసే ఆలోచన తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఆర్టీసీ చార్జీలను పెంచాల్సిన అవసరం మాత్రం ఉందన్నారు.  కొన్ని కారణాల వల్ల ఆర్టీసీ బస్సులు, సిబ్బంది మార్పులు జరుగుతున్నాయని తెలిపారు.

జోగులాంబకు స్పెషల్ బస్

‘ప్రజలు ఇప్పుడిప్పుడే ఆర్టీసీ వైపు మళ్లుతున్నారు. యాజమాన్య నిర్ణయాల వల్ల సంస్థకు వచ్చే ఆదాయంతోపాటు ఓఆర్ కూడా పెరిగింది. భూములు అమ్మాలనే ఆలోచన ఆర్టీసీకి లేదు.1,359 రూట్లలో బస్సులను పునరుద్ధరించాం. బస్సులు అవసరమైన చోట లోకల్ డీఎం, ఆర్ఎంలు సర్వే చేస్తున్నారు. కొన్ని చోట్ల ఆక్యుపెన్సీ తక్కువగా, మరికొన్ని చోట్లు ఎక్కువగా ఉంది. ఎవరికైనా బస్సు అవసరం ఉంటే డీఎంను సంప్రదించాలి. జోగులాంబ వెళ్లినప్పుడు భక్తులు బస్సు కావాలని అడిగారు. వచ్చే శనివారం నుంచి జోగులాంబకు  హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్సు నడుస్తుంది’ అని సజ్జనార్ అన్నారు.

ఉద్యోగుల పాత్రే కీలకం

‘డీజిల్ పెరుగుదల, కరోనా అనంతర పరిస్థితుల వల్ల ఆర్టీసీ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఉద్యోగుల సంక్షేమం ఆర్టీసీకి చాలా ముఖ్యం. బస్ స్టాండుల్లో ఎలాంటి పార్కింగ్ దందా లేదు. సంస్థ సిబ్బందికి ఇవ్వాల్సిన డీఏ, సీసీఎస్ బకాయిలను త్వరగా చెల్లించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. సంస్థ లాభాల బాటలో పయనించాలంటే ఉద్యోగుల పాత్రే కీలకం. వారి సమస్యలన్నీ పరిష్కరిస్తాం’ అని సజ్జనార్ చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం:

‘మెడ మీద కత్తి’ పదానికి అర్థం చెప్పాలె

ఒక్కో దేశానికి వ్యాపిస్తున్న ఒమిక్రాన్

కేసీఆర్ భాష ‘దుబాయ్ శేఖర్’ లా ఉంది