కేసీఆర్ భాష ‘దుబాయ్ శేఖర్’ లా ఉంది

V6 Velugu Posted on Nov 30, 2021

కేసీఆర్, కేటీఆర్ స్మగ్లర్లుగా మారారన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. రీ సైకిల్ బియ్యాన్ని టీఆర్ఎస్ నేతలు ఎఫ్.సి.ఐ కి అమ్ముతున్నారని ఆరోపించారు. కర్నాటక నుండి తక్కువ నాణ్యత గల బియ్యాన్ని తెచ్చి స్మగ్లింగ్ కు పాల్పడుతూ వేల కోట్లు సంపాదిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ అండదండలతో మిల్లర్లు ఎక్కువ తరుగు తీసి రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముసుగులో ఉన్న ఒక స్మగ్లర్ అంటూ విమర్శించారు. తెలంగాణలో పండే నాణ్యమైన బియ్యాన్ని ప్రైవేటుగా రైస్ మిల్లర్లకు అమ్ముతూ డబ్బులు సంపాదిస్తున్నారన్నారు. 

ప్రతిపక్ష పార్టీలు దళిత బంధు గురించి మాట్లాడకుండా ఎదురుదాడి చేస్తున్నారన్నారు. కేసీఆర్ కేంద్ర మంత్రులపై మాట్లాడుతున్న భాష దుబాయి శేఖర్ లాగా ఉందన్నారు. కేసీఆర్ ప్రెస్ మీట్లకు సెన్సార్ బోర్డ్ 18ప్లస్ రేటింగ్ ఇవ్వాలన్నారు. తెలంగాణ సమాజం సిగ్గుపడేలా కేసీఆర్ భాష ఉందన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరో ఇచ్చిన సమాచారాన్ని కేసీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణలో భూముల ధరలు పెరగడంలో కేసీఆర్ గొప్పతనం లేదన్నారు. అలాంటప్పుడు ప్రభుత్వ భూములు ఎందుకు అమ్ముతున్నారు? అంటూ అర్వింద్ ప్రశ్నించారు. 

2014 నుంచి సీఎం కేసీఆర్ ఏ పంటకు బోనస్ ఇచ్చారు? ఏ పంటలను వేయమని ప్రోత్సాహించాడు ? అని నిలదీశారు. గతంలో మొక్కజొన్న, సోయాబీన్ పండించే రైతులను సన్న వడ్లు పండించమని కేసీఆర్ కోరలేదా?  అంటూ ఎంపీ ప్రశ్నించారు. కేసీఆర్ మీడీయా సమావేశాలు అడల్ట్ సినిమాలను తలిపిస్తున్నాయన్నారు. రైతుల మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించమని విద్యుత్ చట్టంలో ఎక్కడా లేదన్నారు. ముఖ్యమంత్రి స్థాయికి దిగజారి కేసీఆర్ బిజెపి ఎంపిలపై పదజాలాన్ని వాడుతున్నారన్నారు. 

 

Tagged CM KCR, KCR Press Meet, KCR language, bjp mp arvind kumar

Latest Videos

Subscribe Now

More News