ర‌న్‌వే పై ఫైర్ ఇంజిన్ బోల్తా.. ఇండిగో విమానానికి త‌ప్పిన ప్ర‌మాదం

ర‌న్‌వే పై ఫైర్ ఇంజిన్ బోల్తా.. ఇండిగో విమానానికి త‌ప్పిన ప్ర‌మాదం

చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో ఈ ఆదివారం ఉదయం ల్యాండ్ అవ్వాల్సిన ఇండిగో విమానానికి ప్ర‌మాదం తప్పింది. 40 మంది ప్ర‌యాణికుల‌తో హైదరాబాదు నుండి రేణిగుంట విమానాశ్రయానికి బ‌య‌ల్దేరిన విమానం ఈ ఉద‌యం 8:30 కి రావాల్సి ఉంది. అయితే విమానం దిగుతున్న సమయంలో… ర‌న్‌వే పై ఓ ఫైర్ ఇంజిన్ బోల్తా పడింది. దీంతో ఆ విమానం విమానాశ్రయంలో ల్యాండింగ్ కాకుండా ఆకాశంలోనే చక్కర్లు కొట్టి బెంగళూరుకు తిరుగు ప్రయాణం అయ్యింది.

విమానాలు దిగే అర్ధగంట ముందు విమానాశ్రయ సిబ్బంది,అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక వాహనంతో ర‌న్ వే మొత్తాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత విమానాలు ల్యాండింగ్ కావడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అలా పరిశీలించే సమయములో ఫైర్ ఇంజిన్ అదుపుతప్పి ర‌న్ వే మీద పడిపోయింది. దీంతో విమానాలు దిగడానికి ఆస్కారం లేకుండా పోయింది. హైద‌రాబాద్ నుండి రేణిగుంట‌కు త‌మ స్వ‌స్థ‌లానికి వ‌ద్దామ‌నుకున్న ఇండిగో విమానంలోని కొంద‌రు ప్ర‌యాణికులు ఈ ఘ‌ట‌న‌తో కొంత‌ అసంతృప్తికి లోన‌య్యారు.