Jay Shah: అతను చెబితేనే కిషన్, అయ్యర్‌లను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించా: బాంబ్ పేల్చిన జైషా

Jay Shah: అతను చెబితేనే కిషన్, అయ్యర్‌లను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించా: బాంబ్ పేల్చిన జైషా

దేశవాళీ టోర్నమెంట్లపై నిర్లక్ష్యం చూపిన ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్స్‌ అయ్యర్‌ లను సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి  తొలగించిన సంగతి తెలిసిందే. ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది. టీమిండియా భవిష్యత్తు స్టార్ ఆటగాళ్లగా వీరిద్దరిని  కాంట్రాక్టు నుంచి తప్పించడంతో చాలామంది బీసీసీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తే.. మరికొందరు క్రమశిక్షణ తప్పినందుకు తగిన చర్యలు తీసుకున్నారని సమర్ధించారు. అయితే కిషన్, అయ్యర్ లను తప్పించడం వెనుక అసలు నిజాన్ని జైషా బయటపెట్టాడు. 

ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌లను సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితా నుండి తప్పించడం అనేది సెలక్టర్ల ఛైర్మన్ అజిత్ అగార్కర్ మాత్రమే తీసుకున్న నిర్ణయమని బీసీసీఐ కార్యదర్శి జైషా వెల్లడించారు. నేను (సెలక్షన్ మీటింగ్‌కి) కన్వీనర్‌ని మాత్రమే. నా పాత్ర కేవలం అమలు చేయడమే. సంజు శాంసన్ వంటి కొత్తగా కాంట్రాక్టు లిస్టులో చేరారు. అని గురువారం ఇక్కడ బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా జైషా అన్నారు. 

దక్షిణాఫ్రికా పర్యటన నుంచి మధ్యలోనే వచ్చేసిన కిషన్‌ ఆ తరువాత జరిగిన ఏ సిరీస్‌లోనూ ఆడలేదు. ఐపీఎల్‌ కోసం హార్దిక్‌ పాండ్యాతో కలసి ప్రాక్టీస్‌ చేశాడు. రంజీ ట్రోఫీలో జార్ఖండ్‌ జట్టు ఆడాలని బీసీసీఐ..హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ చెప్పినా ఇషాన్‌ కిషన్‌ వినలేదు. అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో, బరోడాతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ఆడాలని శ్రేయస్‌ అయ్యర్‌ను కోరినా అతడూ దూరంగా ఉన్నాడు. దీంతో బీసీసీఐ మాట లెక్క చేయని వీరిద్దరూ స్టార్ ప్లేయర్లయినప్పటికీ క్రమశిక్షణ తప్పిన కారణంగా సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి పక్కన పెట్టేశారు. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, గంగూలీ ఈ నిర్ణయాన్ని సమర్ధించారు.