Babar Azam: ఐపీఎల్‌లో రూ.20 కోట్లు ఇచ్చినా బాబర్ ఆడడు: పాక్ మాజీ క్రికెటర్

Babar Azam: ఐపీఎల్‌లో రూ.20 కోట్లు ఇచ్చినా బాబర్ ఆడడు: పాక్ మాజీ క్రికెటర్

ఇండియాలో ఐపీఎల్ కు నెక్స్ట్ లెవల్లో క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ మొదలైందంటే చాలు దేశంలో పండగ వాతావరణం నెలకొంటుంది. ప్రపంచంలో ఈ మెగా లీగ్ ఆడేందుకు ఎంతోమంది ఆసక్తి చూపిస్తారు. ఇప్పటికే విదేశీ ప్లేయర్లకు ఐపీఎల్ వేలంలో మన ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించారు. అయితే ఐపీఎల్ లో పాక్ ప్లేయర్లకు ఐపీఎల్ ఆడే అవకాశం లేదు. 2008 లో జరిగిన తొలి ఎడిషన్ లో మాత్రమే పాక్ ఆటగాళ్లు ఆడారు. ఆ తర్వాత పాక్ ఆటగాళ్లను ఐపీఎల్ లో నిషేధించారు. 

పాక్ ఆటగాళ్లు ఒకవేళ ఐపీఎల్ ఆడితే ఎంత ధర పలుకుతారు అనే విషయంలో క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా బాబర్ అజాం, పేస్ బౌలర్ షహీన్ షా ఆఫ్రిది, రిజవాన్ భారీ ధరకు పలకడం గ్యారంటీ అనే చర్చ గతంలో జరిగింది. అయితే పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా మాత్రం గొప్పలకు పోయాడు. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ను హైలెట్ చేస్తూ కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ బాబర్ కు రూ. 20 కోట్లు ఆఫర్ చేసినా ఆడడని.. అతను దేశానికి అంత ప్రాధాన్యం ఇస్తాడని రమీజ్ రాజా ఇటీవలే చెప్పుకొచ్చాడు. 

రమీజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతనిపై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. కోహ్లీకి 15 కోట్లు ఇస్తుంటే బాబర్ కు 20 కోట్లు ఇస్తారా అని కొందరు అంటుంటే.. బాబర్ చిన్న దేశాలపైనే ఆడతాడు పెద్ద దేశాలపైన ఆడడు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బాబర్ అజామ్ పాక్ పరిమిత ఓవర్ల కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. నేటి (మే 10) నుంచి ఐర్లాండ్ తో పాకిస్థాన్ మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది.