27న ఆర్టీసీ కార్గోలో వేలం.. కస్టమర్లు తీసుకెళ్లని పార్శిళ్లు విక్రయం

27న ఆర్టీసీ కార్గోలో వేలం.. కస్టమర్లు తీసుకెళ్లని పార్శిళ్లు విక్రయం

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఆర్టీసీ కార్గో సర్వీసుల్లో కస్టమర్లు తీసుకెళ్లని పార్శిళ్లను మరోసారి వేలం వేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 27న మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు సికింద్రాబాద్ జేబీఎస్​లోని కార్గో కార్యాలయంలో ఈ వేలం నిర్వహించనున్నామని, మొత్తం 60 రకాల ఉత్పత్తులను వాటి అసలు ధరపై 30 శాతం తక్కువ ధరకే విక్రయించనున్నట్లు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఇషాక్ బిన్ మహ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా 60 రకాల ఉత్పత్తులను వేలం వేయనున్నారు. ఇందులో గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్​, ఎలక్ర్టిక్​,  ఆటోమోబైల్స్​, స్టేషనరీ, ఇండస్ట్రియల్​స్పేర్స్​ వంటివి ఉన్నాయి.