ఢిల్లీ నుంచి రైళ్లలో డిఫెన్స్ లిక్కర్..కాచిగూడలో వ్యక్తి అరెస్ట్..70 బాటిళ్లు సీజ్

ఢిల్లీ నుంచి రైళ్లలో డిఫెన్స్ లిక్కర్..కాచిగూడలో వ్యక్తి అరెస్ట్..70 బాటిళ్లు సీజ్

బషీర్​బాగ్, వెలుగు: ఢిల్లీ నుంచి అక్రమంగా డిఫెన్స్ మద్యం బాటిళ్లను తరలిస్తున్న ఓ వ్యక్తిని కాచిగూడ రైల్వే స్టేషన్​లో ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్​ప్రెస్​లో భారీగా మద్యం తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎక్సైజ్ ఎస్టీఎఫ్ బీ-టీమ్, ఆర్పీఎఫ్, జీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీ సిబ్బంది సోమవారం తనిఖీలు చేపట్టారు.

ఈ దాడుల్లో ఏపీకి చెందిన శివ వద్ద 1.40 లక్షల విలువైన 70 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో సిగ్నేచర్, రాయల్ చాలెంజ్, ఓల్డ్ మంక్ వంటి ప్రముఖ బ్రాండ్ల బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఢిల్లీలో ఉద్యోగం చేస్తూ సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ దందాకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి, తదుపరి చర్యల కోసం కాచిగూడ ఎక్సైజ్ స్టేషన్​కు అప్పగించినట్లు సీఐ బిక్షారెడ్డి తెలిపారు.