ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ పుస్తకాల్లో కృష్ణ భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘జలసిరి’

ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ పుస్తకాల్లో కృష్ణ భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘జలసిరి’
  •   కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చొరవతో సిరిసిల్లలో 6 మీటర్లు పెరిగిన భూగర్భ నీటి మట్టం

హైదరాబాద్, వెలుగు: క్షేత్రస్థాయిలో పక్కా ప్రణాళిక, చిత్తశుద్ధితో పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి డి.కృష్ణ భాస్కర్ నిరూపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌గా పనిచేసిన కాలంలో ఆయన చేపట్టిన విప్లవాత్మక చర్యలతో కేవలం మూడేండ్లలోనే భూగర్భ  నీటి మట్టం ఏకంగా 6 మీటర్ల మేర పెరగడం విశేషం. కొత్త పథకాల కోసం పాకులాడకుండా.. ఉన్న వనరులనే సమర్థవంతంగా వినియోగించుకుంటూ ఉపాధి హామీ పథకాన్ని అస్త్రంగా మార్చుకున్నారు. చెరువుల పునరుద్ధరణ, పూడికతీత పనులు, రిజర్వాయర్ల పటిష్టతపై ప్రత్యేక దృష్టి సారించి నీటి నిర్వహణలో సరికొత్త రికార్డు సృష్టించారు.

ఈ అద్భుత ఫలితాలతో జిల్లాలో వ్యవసాయ సాగు విస్తీర్ణం ఏకంగా 150 శాతం పెరగడం గమనార్హం. కేవలం గణాంకాలకే పరిమితం కాకుండా, రైతన్నల మోముల్లో చిరునవ్వులు పూయించిన ఈ ‘సిరిసిల్ల మోడల్’ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఐఏఎస్ అధికారి కృష్ణ భాస్కర్ చూపిన ఈ చొరవను గుర్తించిన ప్రభుత్వం.. దీనిని ఐఏఎస్ అధికారుల అధికారిక శిక్షణ పాఠ్యపుస్తకాల్లో ఒక కేస్ స్టడీగా చేర్చింది.