మణిరత్నం డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సాయిపల్లవి

మణిరత్నం డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సాయిపల్లవి

సెలెక్టివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సినిమాలు చేస్తూ పదేళ్ల కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పదిహేను సినిమాలు పూర్తి చేసి, ముప్ఫైకి పైగా అవార్డులను అందుకుంది సాయిపల్లవి.  రీసెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ‘అమరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లో నటనకు గాను ఫిల్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫేర్ అవార్డును అందుకున్న ఆమె.. ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో దూసుకెళుతోంది. తాజాగా ఈ వరుసలో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరబోతోంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించబోతున్న చిత్రంలో సాయిపల్లవిని హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీసుకోబోతున్నట్టు సమాచారం. రొమాంటిక్ డ్రామాగా రూపొందే ఈ చిత్రంలో శింబు లేదా ధ్రువ్ విక్రమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీరోగా నటించబోతున్నట్టు వార్తలొచ్చాయి. 

 కానీ అనూహ్యంగా ఇప్పుడు విజయ్ సేతుపతి పేరు ఈ  ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వచ్చింది. తనకు జంటగా సాయిపల్లవి నటించనుందట. ఏఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెహమాన్ సంగీతం అందించనుండగా, ఇప్పటికే కొన్ని ట్రాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయినట్టు తెలుస్తోంది. కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒక్కసారైనా మణిరత్నం డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నటించాలని చాలామంది స్టార్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోరుకుంటారు. అనుకోకుండా ఆ అదృష్టం సాయిపల్లవి తలుపు తట్టింది. ఇక ప్రస్తుతం హిందీలో ‘రామాయణ’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో సీతగా నటిస్తున్న ఆమె.. మరోవైపు ఆమీర్ ఖాన్ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘ఏక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అనే సినిమా చేస్తోంది. అలాగే ధనుష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీరోగా ‘అమరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెరకెక్కిస్తున్న తమిళ చిత్రంలో హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది.