
బీఆర్ఎస్ కు ఓటు అడిగే హక్కు లేదన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ.పెద్దపల్లి జిల్లా మంథని అంబేడ్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన. పదేళ్లుగా బీఆర్ఎస్ నాయకులు దౌర్జన్యాలు చేశారని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని ఇవ్వలేదన్నారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది.. ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ మాట నిలబెట్టుకునే పార్టీ అని అన్నారు.
ఎంపీగా గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మంథని నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు వంశీకృష్ణ. ప్రజల కోసం కష్టపడతానన్నారు. కాకా స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలని చెప్పిన బీజేపీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. వివేక్ వెంకటస్వామిని ఆనాడు ఏరకంగా ఆశీర్వదించారో తనను కూడా అలాగే ఆశీర్వదించాలిని కోరారు.