Bigg Boss Telugu 9 Grand Finale: బిగ్ బాస్ షాకింగ్ ట్విస్ట్: ఫినాలేకు ముందే ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేషన్!

Bigg Boss Telugu 9 Grand Finale: బిగ్ బాస్ షాకింగ్ ట్విస్ట్: ఫినాలేకు ముందే ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేషన్!

తెలుగు బుల్లితెరపై గత వంద రోజులుగా సాగుతున్న అసలు సిసలైన రియాలిటీ యుద్ధం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగింపు దశకు చేరుకుంది. సెప్టెంబర్ 07న అట్టహాసంగా మొదలైన ఈ ప్రయాణానికి రేపు (డిసెంబర్ 21, ఆదివారం) జరిగే గ్రాండ్ ఫినాలేతో ఎండ్ కార్డ్ పడనుంది. పదుల సంఖ్యలో వచ్చిన కంటెస్టెంట్లలో కేవలం ఐదుగురు మాత్రమే తుది పోరుకు అర్హత సాధించారు. ఇప్పుడు ఆ ఐదుగురిలో ఆ బంగారు ట్రోఫీని ముద్దాడి, కోట్లాది రూపాయల ప్రైజ్ మనీని గెలుచుకునే ఆ విజేత ఎవరనేది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

టాప్ 5లో హోరాహోరీ పోరు

ప్రస్తుతం హౌస్‌లో టైటిల్ కోసం కళ్యాణ్ పడాల, తనూజ, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్,  సంజన గల్రానీ పోటీ పడుతున్నారు. వీరంతా తమదైన శైలిలో ఆట తీరుతో, ఎమోషన్స్‌తో ప్రేక్షకులను మెప్పించి ఇక్కడి దాకా వచ్చారు. అయితే, ప్రస్తుత సోషల్ మీడియా ట్రెండ్స్, అనధికారిక ఓటింగ్ లెక్కల ప్రకారం చూస్తే, టైటిల్ పోరు ప్రధానంగా కళ్యాణ్ పడాల, తనూజ మధ్యే సాగుతున్నట్లు కనిపిస్తోంది. కళ్యాణ్ పడాల తన ప్రశాంతమైన స్వభావంతో, టాస్క్‌లలో చురుగ్గా ఉంటూ మెజారిటీ ఆడియన్స్ మనసు గెలుచుకోగా, తనూజ తన స్ట్రాంగ్ పర్సనాలిటీతో మహిళా ఓటర్ల మద్దతు కూడగట్టుకుంది. ఈ ఇద్దరి మధ్య ఓటింగ్ శాతం నిమిష నిమిషానికి మారుతూ ఉత్కంఠ రేపుతోంది.

ఎలిమినేషన్ ట్విస్ట్: ఇద్దరు అవుట్?

గ్రాండ్ ఫినాలేకు ముందు బిగ్ బాస్ మేకర్స్ ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. టాప్ 5లో ఉన్న వారిలో ఇద్దరిని ఫినాలే వేదికపైకి రాకముందే ఇంటికి పంపేందుకు స్కెచ్ వేశారట. ఈ వారం అందుతున్న ఓటింగ్ గణాంకాల ప్రకారం.. సంజన గల్రానీ అందరికంటే తక్కువ ఓట్లతో ఎలిమినేషన్ రేసులో ముందు వరుసలో ఉంది. మిగిలిన నలుగురు కంటెస్టెంట్లతో పోలిస్తే సంజన గ్రాఫ్ కాస్త తక్కువగా ఉండటంతో ఆమె నిష్క్రమణ దాదాపు ఖాయమని తెలుస్తోంది. 

ఇక రెండో ఎలిమినేషన్ ఎవరనే దానిపై గట్టి పోటీ నడుస్తోంది. డిమాన్ పవన్ , ఇమ్మాన్యుయేల్ మధ్య స్వల్ప ఓట్ల తేడా ఉంది. కానీ సంజన తర్వాత డిమాన్ పవన్ కూడా హౌస్ నుండి వీడనున్నారని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే, గ్రాండ్ ఫినాలే వేదికపై కేవలం టాప్ 3 కంటెస్టెంట్స్ మాత్రమే నిలబడే అవకాశం ఉంది.

విన్నర్ ఎవరు? రన్నర్ ఎవరు?

బిగ్ బాస్ చరిత్రను పరిశీలిస్తే, చివరి నిమిషంలో ఓటింగ్ తారుమారైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కళ్యాణ్ వైపు మొగ్గు ఎక్కువగా ఉన్నప్పటికీ, తనూజ ఆర్మీ కూడా సైలెంట్‌గా ఓటింగ్ పెంచుకుంటూ వస్తోంది.  ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు కళ్యాణ్ విన్నర్ గా  తనూజ రన్నర్ గా భావిస్తున్నారు. మరోవైపు, ఇమ్మాన్యుయేల్ తన కామెడీ టైమింగ్‌తో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఇమ్మూ మాత్రం థర్డ్ ప్లేస్ లో నిలిచినట్లు సమాచారం. ఇక ఈ గ్రాండ్ ఫినాలే వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరోలు, మాజీ కంటెస్టెంట్లు విచ్చేసి సందడి చేయనున్నారు. దాదాపు 105 రోజుల సుదీర్ఘ పోరాటం తర్వాత, బిగ్ బాస్ సీజన్ 9 కింగ్ లేదా క్వీన్ ఎవరో తెలియాలంటే ఆదివారం రాత్రి వరకు వేచి చూడాల్సిందే!