వారఫలాలు: డిసెంబర్21 నుంచి 27 వరకు.. 12 రాశుల వారికి ఎలా ఉందంటే..!

వారఫలాలు:  డిసెంబర్21  నుంచి 27  వరకు.. 12 రాశుల వారికి ఎలా ఉందంటే..!

వారఫలాలు: జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం (  డిసెంబర్21   నుంచి  27  వరకు) రాశి ఫలాలను తెలుసుకుందాం..

మేషరాశి : ఈ రాశి వారికి ఈ వారం అన్ని  విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరగడంతో పాటు  ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది.   వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. అనవసర ఖర్చులను చాలావరకు నియంత్రించుకోవాలి. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.  

వృషభరాశి:  ఈ రాశి వారికి ఈ వారి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. గతంలో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.  వృత్తి, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.   ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులుపెట్టేందుకు అనుకూల సమయమని పండితులు చెబుతున్నారు.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. 

మిథునరాశి:  ఈ రాశి వారికి  ఈ  వారమంతా అనుకూలంగా గడిచిపోతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను ఇతరుల సహాయం లేకుండా పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. కొద్ది ప్రయత్నంతో అనుకున్న పనుల్ని అనుకున్నట్టు పూర్తి చేస్తారు. మిత్రుల సహాయంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది.మొండి బాకీలు వసూలవుతాయి.  మీ మాటకు బాగా విలువ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. సమాజంలో గౌరవం కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. 

కర్కాటక రాశి :    ఈ వారం ఈ రాశి వారికి  శుభప్రదంగా ఉంటుంది. మీ పనులు సకాలంలో పూర్తవుతాయి.  వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  ఉద్యోగస్తులకు కొద్దిపాటి ఇబ్బందులు వస్తాయి.  మాట పట్టింపునకు పోకుండా మీ పని మీరు చేసుకోండి.  ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. స్నేహితుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. భూముల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండండి. 

సింహరాశి: ఈ రాశి వారికి  ఈ వారమంతా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సానుకూల ఫలితాలుంటాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉందని జ్యోతిష్య పండితుతు చెబుతున్నారు.. . ఉద్యోగంలో ఆశించిన పురోగతికి అవకాశం ఉంది. వ్యాపారాలు ఊపు అందుకుంటాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాలి. తోబుట్టువులతో సమస్యలు తలెత్తే సూచనన్నాయి. . నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు చాలావరకు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లోనూ, పుణ్య కార్యాల్లోనూ పాల్గొనే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

 కన్యారాశి: ఈఈ రాశి వారు కొత్త ప్రాజెక్టులు చేప‌ట్టే అవ‌కాశం ఉంది.  ప్రతి ప‌నిలో కూడా కొన్ని ఆటంకాలు ఏర్పడుతాయి.  ప్రతి విష‌యాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోండి.  ఆర్థిక విష‌యానికొస్తే ఖ‌ర్చులు పెరిగే అవ‌కాశం ఉంది. ఉద్యోగ‌స్తులు అన‌వ‌స‌రంగా మాట ప‌డాల్సి ఉంటుంది. వ్యాపార‌స్తులు కొత్తగా పెట్టుబ‌డులు పెట్టక‌పోవ‌డ‌మే మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.  అన‌వ‌స‌ర ప్రయాణాలు.. ఆందోళ‌న క‌లిగిస్తాయి. వారం చివ‌రిలో కొన్ని స‌మ‌స్యల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంది. 

తులా రాశి:  ఈ వారం కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.  కొన్ని కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది.కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు కలసివస్తాయి.ఉద్యోగాలలో మార్పులు జరిగే వీలుంది. 
మీపై వచ్చిన అపోహలు తొలగుతాయి. వ్యాపారాలలో అనుకున్న విధంగా  విస్తరిస్తారు. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని ఒప్పందాలలో అవాంతరాలు, వృథా ఖర్చులు ఉంటాయని పండితులు సూచిస్తున్నారు. 

వృశ్చికరాశి:  ఈ రాశి వారికి ఈ వారి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. గతంలో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.  వృత్తి, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. అనుకోకుండా లాభదాయక పరిచయాలు ఏర్పడుతాయి.  బంధువులు.. స్నేహితుల నుంచి శుభవవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.  పాత బకాయిలు వసూలవుతాయి. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులుపెట్టేందుకు అనుకూల సమయమని పండితులు చెబుతున్నారు. 

ధనుస్సురాశి:   ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంద‌ని పండితులు చెబుతున్నారు.  ఉద్యోగ‌స్తుల‌కు కెరీర్ ప‌రంగా పురోగ‌తి ఉంటుంది.  జీవిత‌భాగ‌స్వామి నిర్ణయం ప్రకారం న‌డ‌చుకోండి. ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వు. వ్యాపార‌స్తుల‌కు అధికంగా లాభాలు ఉంటాయి.  ఆర్థికవిష‌యాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వు. నిరుద్యోగులు గుడ్‌న్యూస్ వింటారు. ప్రేమ .. పెళ్లి వ్య‌వ‌హారాలు క‌ల‌సి వ‌స్తాయి.ఎలాంటి ఆందోళ‌న అవ‌స‌రం లేదు. అంతా మంచే జ‌రుగుతుంది. 

మకర రాశి :  ఈ రాశి వారికి ఈ వారం  ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.  బంధువులతో అనుకోకుండా  గొడవలు ఏర్పడుతాయి. . ఈ సమయంలో మీ కోపాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరమని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.కార్యాలయంలో ఎవరితో వాదనలు పెట్టుకోవద్దు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని పండితులు సూచిస్తున్నారు.  ప్రేమ... పెళ్లి విషయాలను తాత్కాలికంగా వాయిదా వేయండి. 

కుంభ రాశి  : ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది.  పాత స్నేహితులు కలవడంతో ఎంజాయి చేస్తారు.  ఉద్యోగస్తులకు.. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు గుడ్​ న్యూస్​ వింటారు.  ఉద్యోగం మారాలనుకునే వారికి ఈ వారం మంచి సమయం. వ్యాపారాలు విస్తరించే అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు . ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి. 

మీన రాశి: ఈరాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో మీ ఆర్థిక సమస్యలు పెరగవచ్చు. కుటుంబంలో వివాదాలు కూడా ఉండవచ్చు.  చాలా తెలివిగా వ్యవహరించండి.  అనుకోకుండా బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు సీనియర్లతో విబేధాలు ఏర్పడుతాయి.  సహోద్యోగుల సహకారం అంతగా  ఉండదు. వ్యాపారస్తులకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది.  ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.