ఇండియా టూర్లో మెస్సీ సంపాదన ఎంత..? ఆర్గనైజర్ చెప్పిన షాకింగ్ నిజాలు !

ఇండియా టూర్లో మెస్సీ సంపాదన ఎంత..? ఆర్గనైజర్ చెప్పిన షాకింగ్ నిజాలు !

ప్రపంచ ఫుట్ బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ ఇండియా టూర్ కొంత తీపి, కొంత చేదును మిగిల్చింది. మెస్సీ కాస్ట్ లీ టూర్ లలో ఇది ఒకటి అని అభిప్రాయపడుతున్నారు. కోల్ కతా ఈవెంట్లో ఏర్పడిన అసౌకర్యంతో  జరిగిన గందరగోళానికి బాధ్యుడిని చేస్తూ ఈవెంట్ మేనేజర్ శతద్రు దత్తాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సిట్ విచారణలో ఆయన వెల్లడించిన నిజాలను తెలుసుకుంటే మెస్సీ టూర్ ఎంత కాస్టో చెప్పవచ్చు.

డిసెంబర్ 13న కోల్ కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈవెంట్ లో.. మెస్సీని తాకడం, హగ్ ఇవ్వడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు వెల్లడించాడు. 

ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ స్పోర్ట్స్ మంత్రి ఆరూప్ బిస్వాస్.. మెస్సీని వదలకుండా వెంటనే ఉంటూ.. అతని కుటుంబ సభ్యులను మెస్సీకి ఇంట్రడ్యూస్ చేయడం.. ఈ విషయంలో మెస్సీ ఫీల్ అయినట్లు  చెప్పాడు. ఈవెంట్ పూర్తయ్యేవరకు బిస్వాస్ మెస్సీ నడుము చుట్టూ చేయి వేస్తూ వ్యవహరించిన తీరుపై మెస్సీ ఆగ్రహించినట్లు తెలిపారు. మొదట కేవలం 150 పాసులనే ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ.. ఇన్ ఫ్లుయెన్షల్ పర్సన్స్ రాకతో టికెట్స్ ట్రిపుల్ చేసినట్లు విచారణలో దత్తా తెలిపారు.

మెస్సీ ఎంత తీసుకున్నాడు:

మెస్సీ ఇండియా విజిట్ ఖురీదైనదని చెప్పడానికి సిట్ ఎదుట శతద్రు దత్తా చెప్పిన వివరాలు సాక్ష్యమని చెప్పవచ్చు. ఈ టూర్ లో మెస్సీకి మొత్తం 89 కోట్ల రూపాయలు చెల్లించినట్లు శతద్రు దత్తా తెలిపారు. మొత్తం 100 కోట్లు అయితే 11 కోట్లు ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించినట్లు విచారణలో తెలిపారు. 

మొత్తం ఈ వంద కోట్లలో 30 శాతం స్పాన్సర్స్ నుంచి, మరో 30 శాతం టికెట్ సేల్స్ ద్వారా సేకరించినట్లు తెలిపారు. అయితే దత్తా అకౌంట్లో మరో 20 కోట్ల రూపాయలు ఉన్నట్లు సిట్ (SIT) అధికారులు గుర్తించారు. కోల్ కతా, హైదరాబాద్ లో మెస్సీ ఈవెంట్ కు టికెట్స్ అమ్మడం ద్వారా, అదే విధంగా స్పాన్సర్స్ ద్వారా వచ్చిన డబ్బేనని విచారణలో వెల్లడించారు. 

డిసెంబర్ 13న జరిగిన ఈవెంట్ లో మెస్సీని చూసేందుకు ఎంత కాస్ట్ అయినా పర్లేదు అని టికెట్స్ కొన్నారు అభిమానులు. కానీ మెస్సీ చుట్టూ ఇన్ ఫ్లూయెన్స్ చేయగల వాళ్లు ఎక్కువగా ఉండటంతో.. మెస్సీ ఆట ఆడకుండా వెనుదిరిగాడు. ఇంత ఖర్చు చేసి వస్తే మెస్సీని కనీసం చూసే చాన్స్ లేదని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.