హాంగ్జౌ: ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో ఇండియా డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ షెట్టి జోడీ పోరాటం ముగిసింది. గ్రూప్ దశలో హ్యాట్రిక్ విజయాలు అందుకొని మెన్స్ డబుల్స్‌లో సెమీస్ చేరిన ఇండియా తొలి జోడీగా రికార్డు సృష్టించిన సాత్విక్–చిరాగ్ నాకౌట్‌లో మాత్రం తడబడ్డారు. శనివారం జరిగిన సెమీస్ పోరులో ఇండియా ద్వయం 21-–10, 17-–21, 15–-21తో చైనాకు చెందిన లియాంగ్ వీ కెంగ్– వాంగ్ చాంగ్ చేతిలో పోరాడి ఓడిపోయింది.
