కేసీఆర్ బయటకు రావడం సంతోషం అని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ . కేసీఆర్ ప్రజా జీవితంలోకి రావడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అధికారానికి దూరమైన నాటి నుంచి ప్రజాజీవితానికి దూరంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఉంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఆదివారం (డిసెంబర్ 21) హైదరాబాద్ లోని బీఆర్ఎస్ భవన్ కు వచ్చారు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రతిపక్షం లేకుండా చేయాలని కాంగ్రెస్ ఎప్పుడు చూడలేదన్నారు పీసీసీ చీఫ్. కేసిఆర్ బయటకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు కోరినట్లు చెప్పారు. కేటీఆర్ మీద విచారణ కొనసాగుతోందని అన్నారు. కేసీఆర్ కూతురు కవిత బీఆర్ఎస్ ను వీడి.. సొంత కుంపటి పెట్టుకునే క్రమంలో.. గత కొన్నాళ్లుగా చేస్తున్న వ్యాఖ్యల మీద కేసీఆర్ ఏం మాట్లాడతారో చూడాలన్నారు.
హెచ్ఎండీఏ పరిధిలో రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి ఏం సాధించారని సోనియా గాంధీకి లేఖ రాశారని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి తెలంగాణకు ఎన్ని నిధులు తీసుకొచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
