Bigg Boss Telugu 9 Finale: బిగ్ బాస్ 9 గ్రాండ్ ఫినాలే: అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద హై అలర్ట్.. విన్నర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు!

Bigg Boss Telugu 9 Finale: బిగ్ బాస్ 9 గ్రాండ్ ఫినాలే: అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద హై అలర్ట్.. విన్నర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు!

తెలుగు బుల్లితెరపై అత్యంత భారీ క్రేజ్ ఉన్న రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9' క్లైమాక్స్‌కు చేరుకుంది. సెప్టెంబర్ 10న ప్రారంభమైన ఈ షో, గత మూడు సీజన్ల కంటే భిన్నంగా ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఉత్కంఠభరితమైన టాస్క్‌లు, ఎమోషన్స్ మధ్య సాగిన ఈ షో మరి కొన్ని గంటల్లో జరిగే గ్రాండ్ ఫినాలేతో ముగియనుంది. అయితే, ఈసారి విన్నర్ ఎవరనే ఉత్కంఠతో పాటు, స్టూడియో బయట భద్రతా వ్యవహారాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

టైటిల్ రేసులో కళ్యాణ్ vs తనూజ

గత వారం వరకు టైటిల్ రేసు కేవలం కళ్యాణ్ పడాల , తనూజ మధ్యే ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న ఓటింగ్ గణాంకాల ప్రకారం.. కళ్యాణ్ పడాల 40 శాతం ఓట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, తనూజ 38 శాతం ఓట్లతో స్వల్ప తేడాతో రెండో స్థానంలో ఉంది. వీరిద్దరి మధ్య కేవలం 2 శాతం వ్యత్యాసం ఉన్నట్లు సమాచారం. దీంతో విజేత ఎవరనేది చివరి క్షణం వరకు చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే ఎక్కువ శాతం కళ్యాణ్ విన్నర్ అవుతారని టాక్ వినిపిస్తోంది.  మరో వైపు గ్రాండ్ ఫినాలేకు ముందు బిగ్ బాస్ ఊహించని షాక్ ఇవ్వబోతున్నారు. టాప్ 5లో ఉన్న వారిలో ఇద్దరిని ఫినాలే వేదికపైకి రాకముందే ఇంటికి పంపించనున్నారు. వారిలో సంజన గల్రానీ అందరికంటే తక్కువ ఓట్లతో ఎలిమినేషన్ రేసులో ముందు వరుసలో ఉంది. రెండో ఎలిమినేషన్ ఎవరనే దానిపై గట్టి పోటీ నడుస్తోంది. డిమాన్ పవన్ , ఇమ్మాన్యుయేల్ మధ్య స్వల్ప ఓట్ల తేడా ఉంది. చివరికి పవన్ ఎలిమినేట్ అవుతున్నారు. మూడో స్థానంలో ఇమ్మూ ఉన్నారని సమాచారం.

పోలీసుల ముందస్తు హెచ్చరిక: 

బిగ్ బాస్ విజేతను ప్రకటించిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హైదరాబాద్ పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు.  గతంలో సీజన్ 7 విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్, రన్నర్ అమర్ దీప్ అభిమానుల మధ్య జరిగిన ఘర్షణ పెద్ద దుమారం రేపింది. ఆ సమయంలో ప్రభుత్వ బస్సుల అద్దాలు పగలగొట్టడం, కార్లపై దాడులు చేయడం వంటి ఘటనల నేపథ్యంలో పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఈ ఏడాది అటువంటి గందరగోళం జరగకుండా పోలీసులు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.. స్టూడియో వద్ద అభిమానులు గుమిగూడటం, ర్యాలీలు తీయడం, విజయోత్సవాల పేరుతో అల్లరి చేయడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

బందోబస్తు:

 గ్రాండ్ ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియో పరిసరాల్లో ముందస్తుగా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఇక వంద రోజుల నిరీక్షణకు రేపటితో తెరపడనుంది. ఓటింగ్ పరంగా కళ్యాణ్ పడాల ముందంజలో ఉన్నప్పటికీ, తనూజ గట్టి పోటీ ఇస్తున్నారు. మరి ఆ బంగారు ట్రోఫీని ముద్దాడి, సీజన్ 9 'నవాబ్'గా నిలిచేది ఎవరో చూడాలి!