ప్రతి ఒక్కరిని విచారించాలి: ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిట్ కీలక నిర్ణయం

ప్రతి ఒక్కరిని విచారించాలి: ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిట్ కీలక నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్‎ను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారించి.. పూర్తి స్థాయి ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయాలని సిట్ నిర్ణయించింది. 

కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపేందుకు హైదరాబాద్ పోలీస్​కమిషనర్​సజ్జనార్‌‌ నేతృత్వంలో ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌(సిట్​)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సజ్జనార్ పర్యవేక్షణలో 9 మంది సభ్యులను నియమించారు.  సజ్జనార్ పర్యవేక్షణలో 9 మంది సభ్యులను నియమించారు.

సిద్దిపేట సీపీ ఎస్‌‌ఎమ్‌‌ విజయ్‌‌కుమార్‌‌(ఐపీఎస్‌‌)‌‌, రామగుండం సీపీ అంబర్ కిషోర్‌‌‌‌ ఝా(ఐపీఎస్‌‌), మాదాపూర్ డీసీపీ రితిరాజ్‌‌(ఐపీఎస్‌‌), మహేశ్వరం డీసీపీ కె.నారాయణరెడ్డి(ఐపీఎస్‌‌), గ్రేహౌండ్స్‌‌ గ్రూప్ కమాండర్‌‌‌‌ ఎం. రవీందర్‌‌‌‌ రెడ్డి, రాజేంద్రనగర్ అడిషనల్‌‌ డీసీపీ కేఎస్‌‌ రావు, ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేస్‌‌ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌‌, జూబ్లీహిల్స్‌‌ ఏసీపీ వెంకటగిరి, టీజీ న్యాబ్‌‌ డీఎస్పీ జీహెచ్ శ్రీధర్‌‌‌‌, హెచ్‌‌ఎంఆర్‌‌‌‌ఎల్‌‌ డీఎస్పీ నాగేందర్ రావును సభ్యులుగా నియమించారు. ఉన్నతస్థాయిలో ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేషన్ చేసి పటిష్టమైన చార్జిషీట్‌‌ దాఖలు చేయాలని ఆదేశించారు.‌‌

ఈ క్రమంలో ఆదివారం (డిసెంబర్ 21) పోలీస్ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఫోన్‌ ట్యాపింగ్‌పై సిట్‌ కీలక సమావేశం నిర్వహించింది. ఇటీవల ఏర్పాటైన సిట్‌ అధికారులతో సీపీ సజ్జనార్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్‌ కేసులో పూర్తి స్థాయి ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారించాలని నిర్ణయించారు.