సూడాన్​లో చిక్కుకున్న ఇండియన్లను తీసుకురావాలని విజ్ఞప్తి

 సూడాన్​లో చిక్కుకున్న ఇండియన్లను తీసుకురావాలని  విజ్ఞప్తి

దుబాయ్: ఆఫ్రికా దేశం సూడాన్​లో చిక్కుకుపోయిన ఇండియన్లను తిరిగి రప్పించాలని వాళ్ల బంధువులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అక్కడి సైన్యం, పారా మిలిటరీ బలగాల మధ్య కొద్దిరోజులుగా ఘర్షణలు జరుగుతున్నాయి. దాడులతో సూడాన్ కేపిటల్ సిటీ ఖర్తూమ్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ గొడవల్లో ఇప్పటివరకు ఒక ఇండియన్​ సహా 185 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,800 మందికి పైగా గాయపడ్డారు. మరికొంతమంది మనోళ్ల జాడ కూడా తెలియట్లేదు. అలా చిక్కుకుపోయిన ఇండియన్ల సమాచారం కోసం మన దేశంలో ఉన్న వాళ్ల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అందరినీ సేఫ్​గా తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

సంప్రదింపులు జరుపుతున్నం: కేంద్రం

సూడాన్‌‌‌‌‌‌‌‌లో ఇండియన్ల భద్రతపై అమెరికా, యూకే, సౌదీ అరేబియా సహా వివిధ దేశాలతో మన దేశం సంప్రదింపులు జరుపుతోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయని, ఈ దశలో మనోళ్లను తరలించడం ప్రమాదకరమని స్పష్టం చేశాయి..