మోదీ.. హిందీ రాని ఇటాలియన్​ కాదు: కంగనా రనౌత్

మోదీ.. హిందీ రాని ఇటాలియన్​ కాదు: కంగనా రనౌత్

సిమ్లా :  ప్రధాని నరేంద్ర మోదీ.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలా హిందీ రాని ఇటాలియన్ కాదని సినీ నటి, మండి లోక్‌‌‌‌సభ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ అన్నారు. దేశాభివృద్ధికి పాటుపడుతున్న ఈ నేల బిడ్డ అని ఆమె పేర్కొన్నారు. శుక్రవారం హిమాచల్​ప్రదేశ్​లోని కులు జిల్లా జగత్​ఖానాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆమె పాల్గొని మాట్లాడారు. మోదీ సుపరిపాలనకు ప్రతీక అని, ప్రధానికి పహారీతో సహా పలు భాషలు తెలుసని అన్నారు. పేద కుటుంబంలో పుట్టి దేశ సంక్షేమం, అభివృద్ధికి పాటుపడుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఓ వైపు మోదీ సుపరిపాలన, మరోవైపు కాంగ్రెస్‌‌‌‌ అవినీతి కనిపిస్తుండడంతో హిమాచల్‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌ ప్రజలు జూన్‌‌‌‌1న జరిగే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని నిర్ణయించుకున్నారని ఆమె తెలిపారు.