భర్త చేతిలో దారుణ హత్యకు గురైన.. జగిత్యాల యూట్యూబర్ వైష్ణవి.. పాపం నాలుగు నెలల గర్భవతి కూడా..

భర్త చేతిలో దారుణ హత్యకు గురైన.. జగిత్యాల యూట్యూబర్ వైష్ణవి.. పాపం నాలుగు నెలల గర్భవతి కూడా..

జగిత్యాల: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో విషాద ఘటన జరిగింది. భార్యను చంపి భర్త పరారయ్యాడు. వైష్ణవి నాలుగు నెలల గర్భవతి అని కుటుంబ సభ్యులు చెప్పారు. ప్రేమ పెళ్లి చేసుకున్న వైష్ణవి, హరిబాబుల మధ్య రాత్రి గొడవ జరిగింది. తెల్లవారి లేచేసరికి ఇంట్లో అచేతనంగా పడి ఉన్న వైష్ణవిని కుటుంబ సభ్యులు గుర్తించారు. భర్తనే హత్య చేశాడని పోలీసులకు వైష్ణవి కుటుంబం ఫిర్యాదు చేసింది.

వైష్ణవి భర్త హరిబాబు కనిపించకుండాపోవడంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవితో సంవత్సరం క్రితం కోరుట్ల అయ్యప్ప గుట్టకు చెందిన హరిబాబుకు వివాహం అయింది. ఈ ఇద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఏడు నెలల క్రితం ఈ ప్రేమ జంట యూట్యూబ్ ఛానల్ కూడా మొదలుపెట్టింది.

Vaishu Amma పేరుతో స్టార్ట్ చేసిన ఈ ఛానల్కు మొత్తం 48 వేలకు పైగా సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఈ ఛానల్ లో వైష్ణవి, హరి పెళ్లి.. హోం టూర్, ప్రెగ్నెన్సీ ఇలా తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చాలా వీడియోలు, షార్ట్స్ పోస్ట్ చేశారు. షార్ట్స్కు అయితే మిలియన్లలో వ్యూస్ వచ్చాయి. యూట్యూబర్గా పాపులర్ అయిన వైష్ణవి జీవితం ఇలా విషాదంగా ముగిసిపోయిందని తెలిసి ఆమె ఫాలోవర్లు ఆమె ఛానల్కు వెళ్లి వీడియోల కింద కామెంట్ల రూపంలో తమ నివాళి తెలియజేశారు. మిస్ యూ వైషూ అని కామెంట్స్ చేశారు.