బిల్లులు ఇవ్వకపోతే పనులు బంద్ చేస్తం.. జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల హెచ్చరిక

బిల్లులు ఇవ్వకపోతే పనులు బంద్ చేస్తం.. జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల హెచ్చరిక
  • 21 వరకు డెడ్​లైన్​

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఈ నెల 21 లోపు తమకు రావాల్సిన బిల్లులు చెల్లించకపోతే ఈ నెల 23 నుంచి మూడు కార్పొరేషన్ల పరిధిలోని పనులను ఎక్కడిక్కడ ఆపేస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరించారు. మూడు నెలల నుంచి పెండింగ్​లో ఉన్న బిల్లులు ఇవ్వాలని సోమవారం జీహెచ్ఎంసీ  కమిషనర్ కర్ణన్​కు వినతిపత్రం ఇచ్చారు. 

తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరం మరో15 రోజుల్లో ముగియనుందని, అయినప్పటికీ తమ బకాయిలు చెల్లించడం లేదన్నారు. బిల్లులు రాక కొత్త  పనులు చేసేందుకు కూడా ఆవకాశం లేకుండా పోతుందన్నారు. అధికారులను ప్రశ్నిస్తే కార్పొరేషన్ల విభజన, సాంకేతిక అంశాలను సాకుగా చూపుతూ దాటవేస్తున్నారని అన్నారు.