Ugadi Sweets 2026: భక్ష్యాలు.. పూర్ణంబూరెలు.. సింపుల్ గా ఇలా తయారు చేసుకోండి..!

 Ugadi Sweets 2026:  భక్ష్యాలు.. పూర్ణంబూరెలు..   సింపుల్ గా ఇలా తయారు చేసుకోండి..!

ఉగాది పండుగనాడు షడ్రుచుల (తీపి, పులుపు, చేదు, ఉప్పు, కారం, వగరు) సమ్మేళనమైన ఉగాది పచ్చడి తప్పనిసరి. వీటితో పాటు డ్రై ఫ్రూట్​ భక్ష్యాలు.. పూర్ణం బూరెలు సాంప్రదాయ వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు.  ఇప్పుడు సింపుల్ గా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం,, , 

డైఫ్రూట్స్ భక్ష్యాల తయారీకి కావాల్సినవి 

  • మైదాపిండి లేదా గోధుమపిండి :రెండు కప్పులు
  •  నెయ్యి :సరిపడా
  •  ఉప్పు :చిటికెడు
  • జీడిపప్పు పొడి :అరకప్పు
  • బాదంపప్పు పొడి: అరకప్పు
  • అంజీర్ పేస్ట్: అరకప్పు
  • ఎండుకొబ్బరి తురుము :అరకప్పు
  • ఇలాచీ పొడి :పావు టీ స్పూన్
  •  బెల్లం తురుము :అరకప్పు

డైఫ్రూట్స్ భక్ష్యాల తయారీ  విధానం:

ఒక గిన్నెలో మైదా లేదా గోధుమపిండి. ఉప్పు, ఒక టీ స్పూన్ నెయ్యి సరిపడా నీళ్లు పోసి మెత్తగా కలపాలి. మరోగిన్నెలో పొడి, బాదంపప్పు పొడి, అంజీర్ పేస్ట్ ఎండుకొబ్బరి తురుము, ఇలాచీ పొడి వేసి బాగా కలపాలి.

మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలాగా చేయాలి. తర్వాత పిండిని కొద్దికొద్దిగా తీసుకుని పూరీల్లా వత్తాలి. వాటి మధ్యలో డ్రై ఫ్రూట్స్ మిశ్రమం పెట్టి, మళ్లీ ఉండలుగా చేయాలి.

వీటిని చేతితో లేదా చపాతీ కర్రతో వత్తాలి. పెనంపై వాటిని నూనె లేదా నెయ్యితో రెండువైపులా కాల్చాలి. ఈ డ్రైఫ్రూట్​ భక్ష్యాలను నెయ్యితో నంజుకుంటే రుచిగా ఉంటాయి.

పూర్ణం బూరెలు తయారీకి కావలసినవి

 

  • శెనగపప్పు :ఒక కప్పు 
  • బెల్లం తురుము: ఒక కప్పు
  • ఇలాచీ పొడి :అర టీస్పూన్
  •  నెయ్యి: సరిపడా
  • మినప్పప్పు :ఒక టేబుల్ స్పూన్
  •  బియ్యప్పిండి :రెండు టేబుల్ స్పూన్లు
  • ఉప్పు: చిటికెడు
  • నూనె :సరిపడా

పూర్ణం బూరెలు తయారీ విధానం

మినప్పప్పును రెండు గంటలు పాటు నానబెట్టి రుబ్బాలి. దాన్ని తడిపిన బియ్యప్పిండిలో వేసి, తగినంత ఉప్పు కలిపి గంట సేపు నానబెట్టాలి. మరోవైపు శెనగపప్పును ఉడికించాలి . నీళ్లు వడగట్టి  ఆ పప్పులో బెల్లం తురుము వేసి రుబ్బాలి.

ఈ మిశ్రమాన్ని నెయ్యిలో వేగించి చల్లారాక చిన్నచిన్న ఉండలుగా చేయాలి. వీటిని పిండిలో ముంచి, మరుగుతున్న నూనెలో దోరగా వేగించాలి. చాలా ప్రాంతాలో పూర్ణం బూరెలను ఉగాది స్పెషల్ గా చేసుకుంటారు