కేజీబీవీలకు బెడ్ల సరఫరా ఒప్పందం కరెక్టే-..హైకోర్టు తీర్పు వెల్లడి

కేజీబీవీలకు బెడ్ల సరఫరా ఒప్పందం కరెక్టే-..హైకోర్టు తీర్పు వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలకు (కేజీబీవీ) బంకర్ బెడ్ల సరఫరాకు సంబంధించి ప్రైవేట్ సంస్థలతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం చట్టబద్ధమేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఒప్పందాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌‌ను న్యాయస్థానం కొట్టివేసింది. కేజీబీవీలకు 45,360 బంకర్ బెడ్లతోపాటు పరుపులు, దిండ్లు సరఫరా చేసేందుకు మఫత్‌‌లాల్ ఇండస్ట్రీస్, ట్రూఫా ఎంటర్‌‌ప్రైజెస్ సంస్థలతో ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంది.

దీనిని తెలంగాణ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ స్టీల్ అండ్ ఉడెన్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ సభ్యులు సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్​వేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ సూరేపల్లి నంద.. టెండర్ కేటాయింపు, ఒప్పంద అమలులో ఎలాంటి దురుద్దేశం ఉన్నట్లు ఆధారాలు లేవని పేర్కొంటూ పిటిషన్‌‌ను కొట్టివేశారు.