కార్పొరేట్‌‌‌‌‌‌‌‌ కాలేజీలు దోచుకుంటున్నయ్‌‌‌‌‌‌‌‌

కార్పొరేట్‌‌‌‌‌‌‌‌ కాలేజీలు దోచుకుంటున్నయ్‌‌‌‌‌‌‌‌

నాంపల్లి (హైదరాబాద్), వెలుగు: ఫీజుల పేరుతో పేరెంట్స్​ను దోచుకుంటున్న కార్పొరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. రూల్స్​పాటించని నారాయణ, శ్రీచైతన్య కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డు ఆఫీస్ ఎదుట బుధవారం చేపట్టిన ధర్నా టెన్షన్​ టెన్షన్​గా సాగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సెక్రటరీ పి.శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్ర సర్కారు విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఇంటర్​లో కార్పొరేట్ విద్యా మాఫియాను రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్ బోర్డు పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. కరోనా కష్టకాలంలో కూడా పేరెంట్స్ ను దోచుకుంటున్నాయని విమర్శించారు.

అకడమిక్ ఇయర్ మూడు నెలలే అయినా ఏడాది ఫీజులు వసూలు చేస్తుంటే సర్కార్ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. స్టూడెంట్లు హాస్టల్స్ లో లేకున్నా ఆ ఫీజుకు కూడా కట్టాలని ప్రెజర్​ చేస్తుంటే ఇంటర్ బోర్డు ఏం చేస్తోందని మండిపడ్డారు. అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ నాయకులు ఇంటర్ బోర్డ్ ఆఫీసులోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు  అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  పోలీసులకు, ఏబీవీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. తర్వాత పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.