హ్యాట్సాప్ సార్ : స్కూల్ పిల్లలకు బిర్యానీ వండిపెట్టిన పోలీస్

హ్యాట్సాప్ సార్ : స్కూల్ పిల్లలకు బిర్యానీ వండిపెట్టిన పోలీస్

మన దేశంలో అక్షరాస్యత రేటు ఏటా పెరుగుతున్నప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో అక్షరాస్యత పెరగటం లేదు. అలాంటి ప్రాంతాల్లో తమిళనాడుకు చెందిన కొండ చోళ నల్లూర్ గ్రామం ఒకటి. ఈ గ్రామంలో టెంత్ పాసవ్వడం అన్నది అరుదైన ఘటన .1998లో ఈ గ్రామంలో కేవలం 8మంది విద్యార్థులు మాత్రమే టెంత్ పాసయ్యారు, ఈ ఎనిమిది మందిలో ఒకడైన ఇన్స్పెక్టర్ ఇలాంగో తన గ్రామంలో అక్షరాస్యత పెంచేందుకు తనదైన కృషి చేస్తున్నారు.

కాలం గడుస్తున్న కొద్దీ ఆ గ్రామంలో అక్షరాస్యత పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది నల్లూర్ గ్రామం నుండి 50మంది విద్యార్థులు పది, ఇంటర్ పరీక్షల్లో పాస్ అయ్యారు. ఈ ఘటనతో ఆనందించిన ఇలంగో తన ఆనందాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. తానే స్వయంగా పిల్లలకు బిర్యాని వండి వడ్డించాడు. పిల్లల్లో స్ఫూర్తి నింపేందుకు ఇలంగో చేసిన ప్రయత్నానికి రాష్ట్రం నలుమూలల నుండి ప్రశంసలు దక్కాయి.ఈ క్రమంలో పిల్లలంతా బాగా చదువుకోవాలని, ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఇలంగో కోరారు.