ఆగని బంగారం ధరల పరుగులు.. స్థిరంగా వెండి.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త ధరలు ఇవే...

ఆగని బంగారం ధరల పరుగులు.. స్థిరంగా వెండి.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త ధరలు ఇవే...

బంగారం ధరలు మళ్ళి భగ్గుమన్నాయి. ఈరోజు (27 ఫిబ్రవరి) 10 గ్రాముల ధర బంగారం ధర రూ. 500 పైగా పెరగ్గా.. వెండి ధర స్థిరంగా  ఉంది. అయితే బంగారం ధరలు పెరగడానికి ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ వైమానిక దాడులకు దిగడం, స్పాట్ మార్కెట్‌లో కొనుగోళ్ల జోరు అధికంగా ఉండటమే దీనికి ముఖ్య కారణం. అయితే రానున్న రోజుల్లో బంగారం ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని.. వెండి ధర నిలకడగా కొనసాగుతుండొచ్చు అని మార్కెట్ నిపుణులు భావిస్తాన్నారు. ఈ నెల చివరి రోజుల్లో  బంగారం, వెండి షాపింగ్ చేయాలనుకుంటున్నట్లయితే ముందుగా కొత్త రేట్లను తెలుసుకోవడం ముఖ్యం. 

 24 క్యారెట్ల బంగారం  1గ్రాము ధర రూ.55 పెరిగి  రూ.16,157 ఉండగా... 22క్యారెట్ల  బంగారం ధర రూ.50 పెరిగి రూ. 14,810.. 18క్యారెట్ల  బంగారం ధర రూ.41 పెరిగి రూ.12,118. 

భారతదేశంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర  రూ.1,61,570, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,100, 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,21,180. 

విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురంలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.1,61,020, 22 క్యారెట్ల ధర రూ.1,47,600, 18 క్యారెట్ల ధర రూ.1,20,770

హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.1,61,020, 22 క్యారెట్ల ధర రూ.1,47,600, 18 క్యారెట్ల ధర రూ.1,20,770

ఈరోజు వెండి ధర 10 గ్రాములకి రూ.2,850, కేజీకి రూ.2,85,000. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కేజీ వెండి ధర  రూ. 2,95,000