రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మోకిలా దగ్గర స్కూల్ బస్సు టిప్పర్ ను ఢీ కొట్టింది. మోకిలా నుంచి శంకర్ పల్లి వస్తుండగా లక్ష్మీనరసింహస్వామి ఆలయం దగ్గర స్పీడ్ బ్రేకర్ల దగ్గర ముందున్న టిప్పర్ ను ఢీ కొట్టింది బస్సు.
ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే స్కూల్ బస్సు డ్రైవర్ పరారయ్యాడు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయపడ్డ విద్యార్థులను హాస్పిటల్ తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ రోజు పాఠశాల బస్సు డ్రైవర్ కాకుండా డ్రైవర్ కొడుకు వాహనాన్ని నడిపినట్లు విద్యార్థులు తెలిపారు. ఈ ప్రమాదానికి జరగడానికి డ్రైవర్ కొడుకే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
