ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనను నిర్దోషిగా కోర్టు ప్రకటించిన ఆప్ అధినేత కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు. తాను చాలా నిజాయితీ పరుడనని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ తీర్పుతో సత్యం గెలిచింది..భారత న్యాయవ్యవస్థ విజయం అన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాపై తీవ్ర విమర్శలు చేశారు. తనపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దురుద్దేశ కుట్రకు పాల్పడిందని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం పేరుతో ఓ ఫేక్ కేసులో సిట్టింగ్ సీఎం గా ఆరు నెలలు జైలులో గడిపిన విషయాన్ని, మనీష్ సిసోడియాను చాలాకాలం జైలులో ఉంచిన విషయాన్ని ప్రస్తావించారు కేజ్రీవాల్.
సీబీఐకి కోర్టులో గట్టి ఎదురుదెబ్బ
లిక్కర్ స్కాం కేసులో మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనిషీ సిసోడియా ఇద్దరినీ విడుదల చేసింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (CBI) కుట్రను భగ్నం చేసింది. ఆరోపణలకు సరియైన చూపించలేదని ఈ కేసులో నిందితులుగా ఉన్న నేతలను నిర్దోషులుగా ప్రకటించింది.కేసులో ఎక్కడా అవినీతి జరగలేదని తేల్చింది. 2022లో ఎక్సైజ్ పాలసీ కి సంబందించిన రెండు అభియోగాలను కోర్టు కొట్టివేసింది.సీబీఐ ఛార్జీషీటు దాఖలు చేసిన తర్వాత ఈ తీర్పుచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో దక్షిణ భారత్ కేంద్రం 100 కోట్ల లాబీయింగ్ జరిగిందని ఆరోపిస్తూ సీబీఐ పలు కేసులు నమోదు చేసింది. తెలంగాణకు చెందిన బీఆర్ ఎస్ నేత కల్వకుంట్ల కవిత తో సహా 23 మందిపౌ కేసులు పెట్టింది.
కేజ్రీవాల్ లాయర్లు అద్భుతంగా వాదించారు..
ఈ కేసులో కేజ్రీవాల్ సీనియర్ లాయర్ ఎన్ హరిహరన్ టీం అద్బుతంగా వాదించారు. ఆప్ నేతపై చేసిన తప్పుడు ఆరోపణలు, తప్పుడు కేసులకు ఎటువంటి ఆధారాలు లేవని గట్టిగా వాదించారు. మొదటి మూడు చార్జీషీట్లో కేజ్రీవాల్ పేరులేదని, నాల్గో చార్జీ షీటులో ఆయన పేరును చేర్చడం, సీఎం గా ఆయన అధికారిక విధులను అడ్డుకునేందుకే ఆరోపణలు, కేసులు పెట్టారని హరిహరన్ హైలైట్ చేశారు.
రాఘవ్ మాగుంట వంటి అప్రూవర స్టేట్ మెంట్లపై సీబీఐ ఆధారపడటాన్ని హరిహరన్ సవాల్ చేశారు. కొనసాగుతున్న దర్యాప్తులను ప్రశ్నించారు. హరిహరన్ వాదనలతో ఏకీభవించిన కోర్టు..ఈ కేసులో ప్రాసిక్యూషన్ లోపాలను కోర్టు నొక్కి చెప్పింది. తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పుతో కేజ్రీవాల్ రాజకీయ పునరాగమనానికి మార్గం సుగమం చేసింది.
