లిక్కర్ స్కామ్ కేసులో.. కేజ్రీవాల్ కు క్లీన్ చిట్

లిక్కర్ స్కామ్ కేసులో.. కేజ్రీవాల్ కు క్లీన్ చిట్

లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ కు భారీ ఊరట.. లిక్కర్ స్కామ్ అవినీతి  కేసులో క్లీన్ చిట్ ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు.  ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్  ను శుక్రవారం విడుదల చేసింది. ఈ కేసులో ఆప్ మరో నేత మనీష్ సిసోడియాతోపాటు మరో 23 మందిని కూడా రాస్ అవెన్యూ కోర్టు ల ప్రత్యేక న్యాయమూర్తి  జితేందర్ సింగ్ విడుదల చేశారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ  జరిపిన దర్యాప్తులో  లోపాలపై కోర్టు తీవ్రంగా స్పందించింది. భారీ ఛార్జీషీట్ లో సాక్షుల ద్వారా నిర్ధారించబడిన అనేక లోపాలున్నట్లు కోర్టు వెల్లడించింది. సిసోడియాపై కేసు రూపొందించడంతో సీబీఐ విఫలమైందని కోర్టు పేర్కొంది. ఎటువంటి ఆధారాలు లేకుండానే కేజ్రీవాల్ ను ఈ కేసులో ఇరికించారని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. 

కోర్టు ఏం చెప్పిందంటే.. 

ఢిల్లీ లిక్కర్ కేసు కొట్టివేసింది ప్రత్యేక కోర్టు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవినీతి జరిగిందంటూ అప్పటి ఢిల్లీ ప్రభుత్వంపై కేసు పెట్టింది సీబీఐ. ఆప్ పార్టీకి చెందిన మాజీ సీఎం కేజ్రీవాల్, మంత్రి మనీష్ సిసోడియాతోపాటు తెలంగాణకు చెందిన కేసీఆర్ కుమార్తె కవితపై అభియోగాలు నమోదు చేసింది సీబీఐ. ఈ కేసులోనే సిసోడియా, కేజ్రీవాల్, కవిత అరెస్ట్ అయ్యి.. తీహార్ జైలుకు వెళ్లారు. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు వీరు. 

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుపై విచారణ చేసిన ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు.. సీబీఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను కొట్టివేసింది. అసలు లిక్కర్ స్కాం జరగలేదని.. ఈ కేసులో ఉన్న 23 మందిపై మోపిన అభియోగాలను కొట్టివేసింది. ఈ కేసులో 45 రోజులు సుదీర్ఘంగా విచారణ కొనసాగించింది ప్రత్యేక కోర్టు. 

విచారణ తర్వాత.. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితులు 23 మందిపై సీబీఐ దాఖలు చేసిన కేసును కొట్టివేసింది కోర్టు. ఆధారాలు లేవని తన తీర్పులో వెల్లడించింది కోర్టు. ఎలాంటి ఆధారాలు లేకుండానే కేజ్రీవాల్, సిసోడియా, కవితతోపాటు ఇతరులను ఈ కేసులో సీబీఐ ఇరికించిందని జడ్జి వ్యాఖ్యానించారు. 

నిందితులుగా పేర్కొంటూ సీబీఐ అభియోగాలు మోపిందని.. వాటిని సరైన ఆధారాలు నిరూపించటంలో సీబీఐ విఫలం అయ్యిందని కోర్టు అభిప్రాయపడింది. ఛార్జిషీట్లలో అనేక లోపాలు ఉన్నాయని.. సీబీఐ చేసిన దర్యాప్తు తీరును తప్పుబట్టింది కోర్టు. నిందితులపై ఆరోపించిన నేరాలకు సంబంధించి ఎలాంటి స్పష్టమైన ఆధారాలను సీబీఐ కోర్టుకు సమర్పించలేదని.. మాజీ సీఎం కేజ్రీవాల్ ను ఇరికించారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. 

కేసు నిస్పక్షపాతంగా విచారణ జరగాలంటే దర్యాప్తు కూడా అదే స్థాయిలో.. నిస్పక్షపాతంగా ఉండాలని కోర్టు వ్యాఖ్యానించింది. చార్జిషీట్లలో నమోదు చేసిన ఆరోపణలకు.. సీబీఐ సరైన ఆధారాలతో నిరూపించలేకపోయిందంటూ.. కేసును కొట్టివేసింది ఢిల్లీ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు. కేసులోని 23 మందిని నిర్దోషులుగా ప్రకటించారు జడ్జి జితేందర్ సింగ్.