వాట్సాప్ యూజర్లు శుక్రవారం ( ఫిబ్రవరి 27) లాగిన్ సమస్యలు ఎదుర్కొన్నారు. వాట్సాప్ వెబ్ లోకి లాగిన్ అయ్యేందుకు ప్రయత్నిస్తే 20 ఎర్రర్ రిపోర్టును అవుట్ టేజ్ ట్రాకింగ్ వెబ్ సైట్ డౌన్ డిటెక్టర్ చూపించింది. చూపించింది. ఈ సమస్య ముఖ్యంగా ఐఫోన్ యూజర్లలో ఎక్కువగా ఉంది.. ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్పాస్ సాధారణంగానే పనిచేసింది.
వాట్సాప్ యూజర్లు తమ వెబ్ లాగిన్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అంతరాయానికి సంబంధించి 20 ఎర్రర్ రిపోర్టును అవుట్ టేజ్ ట్రాకింగ్ వెబ్ సైట్ డౌన్ డిటెక్టర్ నమోదు చేసింది.దాదాపు 56 శాతం యూజర్లు వెబ్ సైట సమస్యలను రిపోర్టు చేయగా.. 39 శాతం మంది యాప్ తో సమస్యలను ఉన్నట్లు ఫ్లాగ్ చేశారు. 6 శాతం మంది మేసేజ్ లు పంపడంలో ఇబ్బందులు తలెత్తినట్టు తెలిపారు. అయితే ఐఫోన్ వినియోగదారుల్లో ఈ సమస్య ఎక్కువ ప్రభావితం చేసినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.
చాలా మంది వినియోగదారుల ముఖ్యంగా ఐఫోన్ లకు వాట్సాప్ వెబ్ లింక్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు X లో షేర్ చేశారు. గంటనుంచి ఐఫోన్ , ఆండ్రాయిడ్ డివైజ్ లలో కూడా లాగిన్ సమస్య ఉన్నట్లు రాశారు.
డైన్ డిటెక్టర్ రిపోర్టు ప్రకారం.. శుక్రవారం ఉదయం 8.37 గంటలనుంచి వాట్సాప్ పనిచేయడం లేదు. 9.52 గంటలనాటికి వందలకొద్ది యూజర్ల లాగిన్ సమస్యలను గుర్తించారు. యాప్ వెబ్ వెర్షన్ లో సమస్యలు ఇప్పటివరకు కొనసాగుతున్నాయి. అయితే వాట్సాప్ వెబ్ సేవలు నిలిచిపోవడంపై మెటా ఫ్లాట్ ఫాం గానీ, వాట్సాప్ నుంచి గానీ ఎటువంటి స్పందన లేదు.
